న్యూఢిల్లీ : పాకిస్తాన్‌కు చెందిన తండ్రీ కూతురు పెండ్లి వేడుకలో జెదా నషా సాంగ్‌కు స్టైలిష్ డ్యాన్స్‌తో దుమ్మురేపిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెడ్డింగ్ ఫొటోగ్రఫీ స్టూడియో వసిలా స్టూడియో ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ 74,000 మందికి పైగా వీక్షించారు.
ఈ వీడియోలో తండ్రి తన లిటిల్ డాటర్‌తో కలిసి జెదా నషా సాంగ్‌కు డ్యాన్స్ చేయడం నెటిజన్లను అలరిస్తోంది. తండ్రికూతురు అద్భుతమైన సమన్వయంతో డ్యాన్స్ ఫెర్ఫామెన్స్ ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంటోంది. వారిద్దరూ ఈజ్‌తో డ్యాన్స్ మూమెంట్స్ ఇస్తూ కిల్లర్ స్టెప్స్‌తో అక్కడున్న వారందరినీ అలరించారు.