క్రికెట్ ఆడుతున్న కుక్క.. వింతగా చూస్తున్న స్థానికులు.. వైరల్ వీడియో
క్రికెట్ ఆడుతున్న కుక్క | కుక్కేంటి క్రికెట్ ఆడటం ఏంటి.. అని ఆశ్చర్యపోకండి. కుక్క నిజంగానే క్రికెట్ ఆడుతోంది. వికెట్ కీపర్‌గా, ఫీల్డర్‌గా ఉండి
కుక్కేంటి క్రికెట్ ఆడటం ఏంటి.. అని ఆశ్చర్యపోకండి. కుక్క నిజంగానే క్రికెట్ ఆడుతోంది. వికెట్ కీపర్‌గా, ఫీల్డర్‌గా ఉండి.. బాల్‌ను మాత్రం అస్సలు మిస్ చేయడం లేదు. అసలు.. కుక్క క్రికెట్ ఆడటం అనేది నిజంగానే వింత. కానీ.. అది నిజం కావడంతో అక్కడి స్థానికులు ఆ కుక్కను చూసి ఆశ్చర్యపోతున్నారు.

ఒక బాలిక బ్యాటింగ్ చేస్తుంటుంది. మరో బాలుడు బౌలింగ్ వేస్తుంటాడు. అంతే.. ఇక ఫీల్డర్, వికెట్ కీపర్ అన్నీ ఆ కుక్కే. బాలుడు బౌలింగ్ వేయగానే.. ఆ బాలిక బ్యాట్‌తో బంతిని కొట్టగానే వెంటనే కుక్క పరిగెత్తి బాల్‌ను తీసుకొచ్చి బౌలర్‌కు ఇచ్చేస్తుంది.
బంతిని నోటకరుచుకొని తీసుకొచ్చి ఇస్తుంది. బంతి ఎంత దూరం వెళ్లినా వేగంగా పరిగెత్తి ఆ బాలిక పరుగులు తీయకుండా వెంటనే బంతిని బౌలర్‌కు అందజేస్తుంది. మొత్తానికి క్రికెట్ ఆడుతున్న కుక్క వీడియోను ఐఏఎస్ ఆఫీసర్ గోపాల్ కృష్ణ ద్వివేది తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Cricketer Doggy!! pic.twitter.com/JtQCeJcuFR
— Gopal Krishna Dwivedi, IAS (Retd.) (@GKDwivediIAS) November 21, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
టీ పౌడర్‌ను డ్రగ్స్ అనుకొని.. తల్లీకూతుళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ప్రతి రోజు 70 సార్లు వాంతి చేసుకుంటుంది.. ఈ మహిళకు ఉన్న జబ్బేంటో తెలుసా?
రోడ్ల మీద కరెన్సీ నోట్ల వర్షం.. ఏరుకోవడానికి ఎగబడ్డ జనం.. వైరల్ వీడియో
హలో.. నా బాయ్‌ఫ్రెండ్ నాతో మాట్లాడటం లేదు సార్.. పోలీసులకు కాల్ చేసిన మహిళ
వార్నీ.. ఏడాది వయసు లేదు.. రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన బుడ్డది.. వైరల్ వీడియో
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

