సైబీరియన్ హస్కీలు మానవ భాషను ఫర్ఫెక్ట్గా అర్థంచేసుకుంటాయని తెలుసు. కొన్ని రకాల చిలుకలు మనుషుల్లాగా మాట్లాడుతాయి. కానీ, పిల్లులు మనుషుల్లాగా సంజ్ఞలు చేయడం ఎప్పుడైనా చూశారా? అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.
పిల్లి యజమానికి చెవులు వినిపించవు. దాని ఆకలి అరుపులు వినిపించవు. దీంతో ఆ పిల్లి యజమానితో సంజ్ఞలతో మాట్లాడడం నేర్చుకుంది. ఆ వ్యక్తిని తన పంజాతో తట్టి, తనకు భోజనం పెట్టాలని మనిషిలా సంజ్ఞలు చేసింది. అనంతరం ఆ వ్యక్తి ఆ పిల్లికి తినిపించడం ప్రారంభించాడు. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.