మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తన పర్సనల్ విషయాలను ఎక్కువగా షేర్ చేసుకోరు కానీ.. సమకాలీన అంశాల మీద మాత్రం ఆయన పోస్టులు పెడుతుంటారు. ఎవరైనా ఆనంద్ మహీంద్రాను సోషల్ మీడియాలో ప్రశ్నించినా.. వెంటనే రిప్లయి ఇస్తారు. కొన్ని ఇన్సిపిరేషనల్ స్టోరీలను షేర్ చేస్తుంటారు. వైరల్ వీడియోలను షేర్ చేస్తుంటారు. ఫన్నీ ఫోటోలను.. ఇలా.. ఏదో ఒకటి షేర్ చేస్తూ.. ఎప్పుడూ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంటారు ఆనంద్.
టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో బంగారు పతకం గెలవడంతో… ఆయనకు త్వరలో రిలీజ్ అయ్యే ఎక్స్‌యూవీ 700 ఎస్యూవీ వెహికిల్‌ను గిఫ్ట్‌గా ఇవ్వండి సార్.. అంటూ ఓ నెటిజన్ ఆనంద్ మహీంద్రాకు సూచించడంతో.. అయ్యో.. అంతకన్నా భాగ్యమా? నీరజ్ చోప్రాకు గిఫ్ట్ ఇవ్వడం నా అదృష్టం. వెంటనే ఒక ఎక్స్‌యూవీ 700 వెహికిల్‌ను నీరజ్ కోసం సిద్ధంగా ఉంచండి.. అంటూ తన కంపెనీ ఎగ్జిక్యూటివ్స్‌ను కూడా ఆ పోస్ట్‌లో టాగ్ చేశారు ఆనంద్.
తాజాగా.. కూరగాయలు అమ్ముకునే ఓ మహిళ.. తన దగ్గరికి వచ్చిన నెమలికి ఆహారం తినిపిస్తున్న వీడియోను ఆనంద్ షేర్ చేశారు. ఆ మహిళ రోడ్డు పక్కన కూరగాయలు పెట్టి అమ్ముతుండగా.. అప్పుడే ఓ నెమలి అక్కడికి వచ్చింది. దీంతో తన దగ్గర ఉన్న కొన్ని గింజలను దానికి ఆహారంగా పెట్టింది. చేతుల్లో పెట్టి నెమలికి చూపించగానే.. నెమలి వాటిని తినేసింది. అక్కడి స్థానికులు ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో కాస్త ఆనంద్ కంటపడింది.
దీంతో ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఒక్కోసారి కొన్ని ఘటనలు చూస్తే ఇంకా మానవత్వం బతికే ఉంది. అందరితో సామరస్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇన్క్రెడిబుల్ ఇండియా.. అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇక.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు అయితే.. ఆ మహిళ చేసిన పనికి జోహార్లు అంటున్నారు.
And sometimes you come across a scene that gives you hope that humanity & the planet will be in harmony. Incredible India. pic.twitter.com/hobIOgh5D1
— anand mahindra (@anandmahindra) August 10, 2021