యూఎస్‌లోని బీచ్‌లో ఓ వింత చేప దర్శనమిచ్చింది. కాలిఫోర్నియా నగరంలోని బీచ్‌లో నడుస్తున్న ఓ వ్యక్తికి డ్రాక్యులాలాంటి కోరలు, ప్రకాశవంతంగా మెరిసే చర్మంతో ఉన్న పొడువాటి చేప కనిపించింది. ఈ చేపను చూసిన ఆ వాకర్ మొదట భయానికి గురయ్యాడు. కాసేపయ్యాక తేరుకొని, దాని ఫొటోలు తీశాడు. ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఈ వింత చేపకు రెండు డ్రాక్యులా లాంటి కోరలు, రెండువైపులా పొడవాటి మొప్పలున్నాయి. ఈ చేప నాలుగు అడుగుల పొడవుంది. వాకర్ చూసినప్పుడు అది ప్రాణంతోనే ఉంది. ఈ చేప ఫొటోలను
ది వెస్ట్ మారిన్ ఫీడ్ అనే స్థానిక పత్రిక ప్రచురించింది. దీన్ని లాన్సెట్ ఫిష్ అని పిలుస్తారని మ్యూజియం ఆఫ్ వెర్టిబ్రేట్ జువాలజీలో ఇచ్థియాలజీ క్యూరేటర్ క్రిస్టోఫర్ మార్టిన్ తెలిపారు.