బ్రహ్మాజీ, మురళీధర్‌గౌడ్, రచ్చ రవి, అభయ్ బేతిగంటి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కృష్ణంభజే’. నాగరాజ్ కొట్టే దర్శకత్వంలో కలాల్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నటుడు బ్రహ్మాజీ మార్కండేయ పాత్రను పోషిస్తున్నారు. శుక్రవారం కృష్ణాష్టమి సందర్భంగా ఆయన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
కాషాయ వస్త్రధారణలో ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తూ ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంటున్నది. పౌరాణిక, భక్తిరస నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, కథానుగుణంగా మంచి ఆర్టిస్టులు కుదిరారని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నదని, త్వరలో టీజర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మంతెన త్రినాథ్, సత్య సోమేష్, దర్శకత్వం: నాగరాజ్ కొట్టే.