భార్యలతో షాపింగ్ వెళ్లాలంటే భర్తలు జంకుతారు. షాపింగ్ అంటేనే వామ్మో..! అంటారు. భార్య మాట కాదనలేక వెళ్లిన భర్తలు గంటలతరబడి వేచిచూస్తూ విసిగివేసారిపోతారు. మహిళల ఏళ్లనాటి ఈ సమస్యకు చైనాలోని ఓ షాపింగ్‌మాల్ పరిష్కారం కనుగొన్నది. భార్యలవెంట షాపింగ్‌కు వచ్చిన భర్తల కోసం *హస్బెండ్ స్టోరేజీ ప్యాడ్* (ప్రత్యేక గదులు) ఏర్పాటు చేసింది.
షాంఘైలోని గ్లోబల్ హార్బర్ మాల్ ఈ సరికొత్త ప్రయోగం చేసింది. ఈ హస్బెండ్ స్టోరేజీ ప్యాడ్ అంటే కేవలం ప్రత్యేక గది మాత్రమే అనుకుంటే మీరు పొరబడినట్లే..ఇందులో భర్తలకు బోర్‌కొట్టకుండా ఓ మానిటర్, గేమ్‌ప్యాడ్, కుర్చీ ఉంటాయి. ఎంతసేపైనా గేమ్స్ ఆడుకుంటూ కాలక్షేపం చేయొచ్చు. ప్రస్తుతానికైతే ఈ గేమ్స్‌ను ఫ్రీగానే ఆడుకునే వీలుకల్పించారు. కానీ భవిష్యత్తులో గేమ్‌ను బట్టి కొంత అమౌంట్ చార్జ్ చేస్తామని చెబుతున్నారు మాల్ నిర్వాహకులు. ఇదిలా ఉండగా, తాను టెక్కెన్ 3 అనే గేమ్ ఆడానని, తన స్కూల్‌డేస్ గుర్తొచ్చాయని ఓ భర్త ఆనందంగా చెప్పాడు. ఇప్పుడు ఈ వార్త చైనా సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది.