కోడి మెదళ్లు తిన్నా.. 111 ఏండ్లు బతికున్నా..!
ఆస్ట్రేలియాకు చెందిన అత్యంత ఎక్కువ వయసున్న ఓ పెద్దాయన.. తానింతకాలం జీవించడానికి గల రహస్యాన్ని బట్టబయలు చేశాడు. అదేంటంటే.. కోడి మెదళ్లు తినడమే అంటూ చల్లగా చెప్పాడంట.

కాన్బెర్రా: ఆస్ట్రేలియాకు చెందిన అత్యంత ఎక్కువ వయసున్న ఓ పెద్దాయన.. తానింతకాలం జీవించడానికి గల రహస్యాన్ని బట్టబయలు చేశాడు. అదేంటంటే.. కోడి మెదళ్లు తినడమే అంటూ చల్లగా చెప్పాడంట.
పదవీ విరమణ చేసిన పశువుల పెంపకందారుడు అయిన డెక్స్టర్ క్రుగర్ సోమవారం నాటికి 111 ఏండ్ల వయసు దాటి 124 రోజులను పూర్తిచేసుకున్నాడు. మొదటి ప్రపంచ యుద్ధ అనుభవజ్ఞుడు జాక్ లాకెట్ 2002 లో మరణించినప్పుడు ఇతడి కంటే ఒక రోజు పెద్దవాడు.
రూరల్ క్వీన్స్లాండ్ రాష్ట్ర పట్టణమైన రోమాలోని తన నర్సింగ్ హోమ్‌లో ఈ మైలురాయికి కొన్ని రోజుల ముందు డెక్స్టర్ క్రుగర్ ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్‌తో మాట్లాడాడు. పౌల్ట్రీ ఆహారం ఎంతో రుచికరమైనదే కాకుండా.. తన దీర్ఘాయువుకు దోహదపడిందని చెప్పారు. కోళ్లకు తల ఉంటుంది. ఆ తలలో ఉండే చిన్న మెదడు ఎంతో రుచికరమైందే కాకుండా నా ఆయుష్షును పెంచింది అని తన సీక్రెట్‌ను బయటపెట్టాడు. క్రుగర్ 74 ఏండ్ల కుమారుడు గ్రెగ్ ఆయనకు కావాల్సినవన్నీ దగ్గరుండి సమకూర్చాడు.
తన ఆత్మకథ రాస్తున్న డెక్స్టర్ క్రుగర్ జ్ఞాపకశక్తి అద్భుతమైనదని నర్సింగ్ హోమ్ మేనేజర్ మెలానియా కాల్వెర్ట్ చెప్పారు. క్రుగర్ ఆస్ట్రేలియాలో అత్యంత వయసున్న వ్యక్తిగా ఉన్నారని ది ఆస్ట్రేలియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపకుడు జాన్ టేలర్ ధ్రువీకరించారు.
ఇవి కూడా చదవండి..
కన్నారం పిల్లోడు.. ‘ట్రేస్ చాట్’ కనిపెట్టిండు..!
ఓలి ప్రమాణ స్వీకారంపై వివాదం.. సుప్రీంకోర్టులో విచారణ
బైడెన్ కన్నా కమలా సంపాదన ఎక్కువ.. ఎంత పన్ను చెల్లిస్తున్నారంటే..?!
టీకా దౌత్యానికి భారత్, దక్షిణాఫ్రికాకు చైనా మద్దతు
ఇక న్యూయార్క్‌లో దీపావళి సెలవుదినం..?
వచ్చే నవంబర్‌లో బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన
ముగిసిన ఎల్టీటీఈ శకం.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

