IRCTC Tour | అధ్యాత్మిక పర్యటనలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని, ఓంకారేశ్వర్, మహేశ్వర్, ఇండోర్ వెళ్లే పర్యాటకుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘మధ్యప్రదేశ్ మహా దర్శన్’ (Madhya Pradesh Maha Darshan) పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోండగా.. విమాన మార్గంలో (Flight Route) ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తున్నారు.
‘మధ్యప్రదేశ్ మహా దర్శన్’ (Madhya Pradesh Maha Darshan) పేరుతో ఐఆర్సీటీసీ (IRCTC Tourism) ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోండగా.. ప్రస్తుతం ఈ టూర్ ఆగస్ట్ 3వ తేదీన అందుబాటులో ఉంది.. . ఈ టూర్ ప్యాకేజీలో ఉజ్జయిని (Ujjain), ఓంకారేశ్వర్ (Omkareshwar), మహేశ్వర్ (Maheshwar) లాంటి అధ్యాత్మిక (Spiritual) ప్రాంతాలు సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండగా.. ఇది 3 రాత్రులు, 4 రోజులు కొనసాగుతుంది.
‘మధ్యప్రదేశ్ మహా దర్శన్’ ప్రయాణం ఇలా..
Day 1: మొదటి రోజు హైదరాబాద్ (Hyderabad) లో టూర్ ప్రారంభం అవుతుంది. ఉదయం 5.30 గంటలకు హైదరాబాద్ ఎయిర్ పోర్టు (RGIA) లో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 7.45 గంటలకు ఇండోర్ (Indore) చేరుకుంటారు. హోటల్ చెకిన్ అనంతరం ఉజ్జయిని (Ujjain) బయలుదేరాలి. అక్కడ స్థానిక ఆలయాలైన హరసిద్ధి మాత ఆలయం (Harsiddhi Mata Temple), సాందీపని ఆశ్రమం (Sandipani Ashram), కాల భైరవ ఆలయం (Khala Bhairava Temple), మంగళనాథ్ ఆలయం (Mangalanath Temple), చింతామన్ గణేష్ (Chintaman Ganesh Temple) ఆలయాలను సందర్శిస్తారు. సాయంత్రం మహాకాళేశ్వర్ ఆలయ (Mahakaleshwar Temple) దర్శనం (మీ స్వంతంగా) చేసుకోవచ్చు. అనంతరం రాత్రికి ఉజ్జయినిలో బస (Night Stay at Ujjain) చేస్తారు.
Day 2 : రెండో రోజు ఉదయం అల్పాహారం చేసి మహాకాళేశ్వర్ ఆలయ దర్శనం (మీ స్వంతంగా) ఉంటుంది. అనంతరం ఓంకారేశ్వర్ (Omkareshwar) కు బయలుదేరుతారు. సాయంత్రం ఓంకారేశ్వర్ చేరుకున్న తర్వాత ఆలయ దర్శనం ఉంటుంది. రాత్రికి ఓంకారేశ్వర్‌లో బస ఉంటుంది.
Day 3 : అల్పాహారం చేసి మధ్యాహ్నానికి హోటల్ నుంచి చెక్ అవుట్ ఉంటుంది. తర్వాత
మహేశ్వర్ (Maheshwar) బయలుదేరుతారు. మహేశ్వర్ చేరుకున్న అనంతరం అహల్యదేవి ఫోర్ట్ (Ahilya Devi Fort ), నర్మదా ఘాట్ (Narmada Ghat) సందర్శన ఉంటుంది. ఆ తర్వాత ఇండోర్ బయలుదేరాలి. రాత్రికి ఇండోర్‌లో బస ఉంటుంది.
Day 4 : నాలుగో రోజు ఇండోర్‌లో అన్నపూర్ణ మందిర్ (Annapurna Mandhir), లాల్ భాగ్ ప్యాలెస్ (lal Bagh Palace) సందర్శన ఉంటుంది.. ఆ తర్వాత తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. రాత్రి 7.20 గంటలకు ఇండోర్‌లో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 8.40 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
హైదరాబాద్ టూ ‘మధ్యప్రదేశ్ మహా దర్శన్’ ప్యాకేజీ ధర
Hyderabad to Maha Darshan Tour cost | మహా దర్శన్ టూర్ ప్యాకేజీ ధర చూస్తే సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.28,000, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.22,200, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.21,300, చెల్లించాలి. టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్స్, హోటల్లో బస, 4 బ్రేక్‌ఫాస్ట్, 3 డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
పూర్తి వివరాల కోసం.. IRCTC క్రింది వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి