IRCTC Hyderabad To Kashmir Tour Package | వేసవిలో భూతల స్వర్గం కశ్మీర్ ను చూడాలని ఎవరికి ఉండదు. మంచు కొండల్లో హాయిగా గడపాలని చాలా మంది అనుకుంటారు. లోయలకు తెల్ల చీర కట్టినట్టుగా కనిపించే మంచు అందాలను చూస్తూ.. తెగ ఎంజాయ్ చేస్తారు. అందులోనూ ఈ అందాలను చూడటానికి విమానంలో జర్నీ అంటే ఇక ఎగిరి గంతేయాల్సిందే. తాజాగా అలాంటి వారికోసమే ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందిస్తోంది.
మిస్టికల్ కశ్మీర్ ఎక్స్ హైదరాబాద్ (MYSTICAL KASHMIR EX HYDERABAD) పేరుతో ఐఆర్సీటీసీ ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోండగా.. మే 19 నుంచి జూన్ 30 వరకు ఈ ప్యాకేజీ (Kashmir Tour Package) బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో గుల్మార్గ్(Gulmarg), పహల్గామ్, శ్రీనగర్ (Srinagar), సోన్మార్గ్ (Sonomarg) లాంటి పర్యాటక ప్రాంతాలు సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండగా.. ఇది 5 రాత్రులు, 6 రోజులు కొనసాగుతుంది. ఇప్పటికే మే 19, 26 తేదీలకు సంబంధించిన టికెట్ బుకింగ్‌లు ముగియగా.. జూన్ 9 నుంచి 30 తేదీల్లో లిమిటెడ్ సంఖ్యలో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారికి హౌజ్ బోట్లో వసతి లభిస్తుంది.
ఐఆర్సీటీసీ కాశ్మీర్ టూర్ ప్రయాణం ఇలా..
Day 1: మొదటి రోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లో టూర్ ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 1.40 గంటలకు హైదరాబాద్ ఎయిర్ పోర్టు(HYD RGIA)లో ఫ్లైట్ ఎక్కితే సాయంత్రం 4.40 గంటలకు శ్రీనగర్ చేరుకుంటారు. సాయంత్రం దాల్ సరస్సులో షికారా రైడ్‌కు వెళ్లొచ్చు. అనంతరం చార్ చినార్‌లో సూర్యాస్తమయాన్ని, ప్లోటింగ్ గార్డెన్స్‌ని చూడవచ్చు. రాత్రికి శ్రీనగర్‌లో బస ఉంటుంది.
Day 2 : రెండో రోజు ఉదయం అల్పాహారం చేసి.. సోన్మార్గ్ బయల్దేరాలి. తాజ్వాస్ గ్లేసియర్ (thajiwas glacier) చూడొచ్చు. అక్కడ పర్యాటకులు సొంత ఖర్చులతో గ్లేసియర్ పాయింట్స్, ఇతర సైట్ సీయింగ్ ప్లేసెస్ వీక్షించొచ్చు. అనంతరం రాత్రికి శ్రీనగర్‌లో బస చేయాలి.
Day 3: మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ చేసి.. గుల్మార్గ్కు బయలుదేరాలి. రోడ్డు మార్గంలో వెళ్తారు. పచ్చికభూములు కనిపిస్తాయి. ఖిలన్మార్గ్ వరకు ఒక చిన్న ట్రెక్ కూడా ఉంటుంది. స్వంత ఖర్చుతో చేయాలి. అనంతరం కొన్ని ప్రదేశాలను చూపిస్తారు. తిరిగి శ్రీనగర్‌కు బయలుదేరుతారు. రాత్రి భోజనం, హోటల్లో బస చేయాలి.
Day 4: నాలుగో రోజు పహల్గామ్ బయల్దేరాలి. దారిలో కుంకుమపువ్వు తోటలు, అవంతిపుర శిథిలాల సందర్శన ఉంటుంది. బేతాబ్ వ్యాలీ, చందన్వారీ, అరు వ్యాలీ చూడొచ్చు. పర్యాటకులు సొంత ఖర్చులతో మినీ స్విట్జర్లాండ్, సమీప సందర్శన స్థలాలను సందర్శించవచ్చు. తిరిగి శ్రీనగర్ చేరుకుని రాత్రి బస చేయాలి.
Day 5: ఐదో రోజు శ్రీనగర్ సందర్శన ఉంటుంది. మొఘల్ గార్డెన్స్, చెష్మాషాహి, పరిమహల్, బొటానికల్ గార్డెన్, షాలిమార్ గార్డెన్స్ సందర్శించవచ్చు. తర్వాత దాల్ సరస్సు ఒడ్డున ఉన్న ప్రసిద్ధ హజ్రత్బాల్ పుణ్యక్షేత్రం సందర్శన. రాత్రికి హౌజ్‌బోట్‌లో బస ఉంటుంది.
Day 6: ఆరో రోజు ఉదయం శంకరాచార్య ఆలయ(Adi Shankaracharya Temple) దర్శనం ఉంటుంది. ఆ తర్వాత కాసేపు షాపింగ్ చేసుకుని తర్వాత శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లాలి. సాయంత్రం 5.10 గంటలకు శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ ఎక్కితే రాత్రికి 8.05 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ కశ్మీర్ టూర్ ప్యాకేజీ ధర
ఇక చార్జీల విషయానికి వస్తే.. ప్యాకేజీలో ఒక్కరు ప్రయాణించాలనుకుంటే రూ.42,895 చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరు రూ.38,200, ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే రూ.36,845 చెల్లించాల్సి ఉంటుందని ఐఆర్సీటీసీ తెలిపింది. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, హోటల్లో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
పూర్తి వివరాల కోసం.. IRCTC క్రింది వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి
https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHA11A