శుక్రవారం 23 అక్టోబర్ 2020
Tourism - Sep 21, 2020 , 07:44:07

తెరుచుకున్న తాజ్‌మహల్‌

తెరుచుకున్న తాజ్‌మహల్‌

లక్నో : అన్‌లాక్‌ 4లో భాగంగా ఈ నెల 21 నుంచి తాజ్‌ మహల్‌, ఆగ్రా ఫోర్ట్‌ తెరుచుకున్నాయి. కొవిడ్‌ మార్గదర్శకాల మేరకు పర్యాటకులకు అనుమతి ఇస్తున్నారు. కరోనా మహమ్మారి సంక్రమణ నేపథ్యంలో మార్చి 17న పర్యాటక ప్రాంతాలు మూతపడ్డాయి. దాదాపు ఆరు నెలల తర్వాత పర్యాటకులను ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు అనుమతి ఇస్తున్నారు. రోజుకు సుమారు 5వేల మంది పర్యాటకులను మాత్రమే అనుమతి ఇస్తున్నారు. తాజ్‌మహల్‌ సందర్శనకు  మధ్యాహ్నం వరకు 2500, ఆ తర్వాత మరో 2500 మందికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో పేపర్‌ టికెట్ల జారీని నిలిపి వేసి, ఎలక్ట్రానిక్‌ టికెట్లు జారీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ థర్మల్‌ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు. మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి చేశారు. అలాగే ఎప్పటికప్పుడు అధికారులు శానిటైజ్‌ పనులు చేపట్టనున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.



logo