ఏరోస్పేస్ హబ్‌గా హైదరాబాద్: మంత్రి కేటీఆర్

హైదరాబాద్: ఏరోస్పేస్ రంగానికి హైదరాబాద్ హబ్‌గా మారుతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. సమర్థ నాయకత్వం, సుస్థిర ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో విమానయానరంగం అభివృద్ధిపై మండలి సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఏరోస్పేస్ తయారీ, ఇంజినీరింగ్, మెటీరియల్ విభాగాల్లో 3 నుంచి 5 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయని చెప్పారు. హైదరాబాద్‌లో 7 ఎస్ఈజెడ్లలో ఏరోస్పేస్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆదిభట్లలో డెడికేటెడ్ ఏరోస్పేస్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రానికి డిఫెన్స్ కారిడార్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు. డిఫెన్స్ కారిడార్ ఏర్పాటుకు రాష్ట్రం అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పారు. అయితే దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే కేంద్రం ప్రాధాన్యత ఇస్తున్నదని విమర్శించారు. అయినప్పటికీ హైదరాబాద్-బెంగళూరు మధ్య డిఫెన్స్ కారిడార్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తామన్నారు. ఏరోస్పేస్ రంగానికి రాష్ట్రంలో ఉజ్వల భవిష్యత్ ఉందని స్పష్టం చేశారు.
Read Today's Latest Topstories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

