ఆర్ఎంపీలకు శిక్షణ

భారత అమెరికన్ వైద్యులు ముందుకు
ప్రాజెక్టు మదద్ పేరిట స్వచ్ఛంద కార్యక్రమం
తెలంగాణ నుంచే ప్రారంభం
న్యూయార్క్, మే 23: సెకండ్ వేవ్లో కరోనా మహమ్మారి గ్రామాల్లో ఉద్ధృతంగా విస్తరిస్తున్న వేళ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యులకు అవసరమైన సలహాలు, సూచనలు, సహాయం చేసేందుకు అమెరికాలోని భారత సంతతి వైద్యులు, ఉద్యోగులు ఓ బృందంగా ఏర్పడి స్వచ్ఛందంగా ‘ప్రాజెక్టు మదద్’ పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భారత వైద్యులు కూడా భాగస్వాములు కానున్నారు. వీరు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలకు, వైద్యులకు కొవిడ్ చికిత్సపై సూచనలు చేయనున్నారు. కొవిడ్ లక్షణాల గుర్తింపు, స్వల్ప లక్షణాలు ఉంటే ఇంటి దగ్గరే చికిత్స, టీకాపై సమాచారం ఇవ్వడం, రోగులు అనవసరంగా ఎక్కువ మందులు వేసుకోకుండా చూడటం లాంటి వాటిపై శిక్షణ ఇవ్వనున్నారు. దవాఖానల్లో బెడ్ల అందుబాటుపై ఎప్పటికప్పుడు వైద్యులకు సమాచారం అందిస్తారు. తొలుత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఈ మదద్ బృందం పనిచేయనున్నది. ఈ టీమ్ మండల స్థాయి ఆర్ఎంపీ సంఘాలతో సమన్వయమై పనిచేస్తుంది. వారంలో రెండు రోజులు జూమ్ ప్లాట్ఫాం ద్వారా వైద్యులతో సమావేశమై సూచనలు చేస్తుంది. మదద్ బృందం ఇప్పటివరకు 150 మంది ఆర్ఎంపీలతో కొవిడ్ చికిత్సపై సమాచారం ఇచ్చింది.
Read Today's Latest Top-slides News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

