BC Atma Gaurava Bhavans | బీసీల ‘ఆత్మగౌరవం’పై కాంగ్రెస్ సర్కార్ పెత్తనం.. వేల కోట్ల విలువైన ఆస్తుల హస్తగతానికి గుట్టుగా జీవో!
BC Atma Gaurava Bhavans | బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. ఆత్మగౌరవ భవనాలను తన గుప్పిట్లోకి తీసుకునేందుకు రంగం సిద్ధంచేసింది. ఇప్పుడున్న కులసంఘాలను నామమాత్రం చేసి.. అధికారాలన్నీ సొంతం చేసుకునేలా ప్రతిపాదనలను ముందుకుతెచ్చింది.
BC Atma Gaurava Bhavans | భూముల వేలం తప్ప మరేదీ ఆలోచించని కాంగ్రెస్ సర్కార్.. బీసీ భవనాలను మాత్రం వదిలిపెడుతుందా? ఆత్మగౌరవ సౌధాలనుంచి, విలువైన భూముల నుంచి కులసంఘాలను వెళ్లగొట్టి, ట్రస్టుల్ని రద్దు చేసి ఆ ఆస్తుల్ని చేజిక్కించుకోవాలని రేవంత్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అందుకోసం భవన నిర్వహణ కమిటీల ముసుగులో పెత్తనం తన చేతిలోకి తీసుకోబోతున్నది. ఇందుకోసం బీసీ సంఘాలతో సంప్రదించకుండా, గుట్టుచప్పుడు కాకుండా జీవో-14 జారీ చేసింది.
హైదరాబాద్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. ఆత్మగౌరవ భవనాలను తన గుప్పిట్లోకి తీసుకునేందుకు రంగం సిద్ధంచేసింది. ఇప్పుడున్న కులసంఘాలను నామమాత్రం చేసి.. అధికారాలన్నీ సొంతం చేసుకునేలా ప్రతిపాదనలను ముందుకుతెచ్చింది. గతంలో ఖరారుచేసిన ట్రస్ట్లన్నింటినీ రద్దు చేసి, మళ్లీ సర్కార్ ముందు మోకరిల్లేలా నిబంధనలు రూపొందించింది. తద్వారా ఆయా భవనాలను, బీసీ కులాలకు గతంలో ప్రభుత్వం కేటాయించిన భూములను కొట్టేసేందుకు పక్కా ప్లాన్ వేసి, అమలు చేస్తున్నది. ఇందుకు సంబంధించి అధికారులు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. నిబంధనలు మా ర్చి గుట్టుగా జీవో 14 తెచ్చింది. దీంతో వేల కోట్ల విలువైన భూములు, ఆత్మగౌరవ భవనాల నిర్వహణ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లనున్నది. సర్కార్ నూతన ప్రతిపాదనలపై కులసంఘాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. బీసీలను అణగదొక్కే కుట్రగా సంఘాల నే తలు నిప్పులు చెరుగుతున్నారు.
కేసీఆర్ హయాంలో రూ.కోట్ల విలువైన స్థలాలు
బీసీలు ఆత్మగౌరవాన్ని చాటుకునేలా వారి కోసం భవనాలు నిర్మించాలన్న యో చన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల నుంచి పుట్టింది. అందులో భాగంగా 2018లో 40 బీసీ కులాలకు ఆ త్మగౌరవ భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రంగారెడ్డి జిల్లా కోకాపేట, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ భగాయత్ తదిత ర చోట్ల 82.30 ఎకరాలు కేటాయించారు. వీటి నిర్మాణానికి రూ.95.25 కోట్లు కేటాయించారు. హెచ్ఎండీఏ రూ.10 కోట్లు ఖర్చుచేసి కులసంఘాల వారీగా ప్రభుత్వం కేటాయించిన విస్తీర్ణానికి అనుగుణంగా స్థలాలను గుర్తించింది. అనంతరం భవనాల నిర్మాణానికి మార్గదర్శకాలతోపాటు 36 భ వనాల నిర్మాణానికి జీవో 20 ద్వారా 2018లో బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు సైతం 2019లో ఆత్మగౌరవ భవనాలకు చెందిన స్థలాలను కేటాయిస్తూ, అందుకు సంబంధించిన పత్రాలను బీసీ సంక్షేమ శాఖ జిల్లా అభివృద్ధి అధికారులకు అందజేశారు.
బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని మరింత ఇనుమడించేలా ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి మా ప్రభుత్వం అత్యంత విలువైన స్థలాలను ఉచితంగా కేటాయించింది. ఇవి కేవలం భవనాలు కావు. ఆయావర్గాల సమస్యల పరిష్కార వేదికలు. సమాలోచిత మందిరాలు. నిర్మాణం, డిజైన్ల మొదలు నిర్వహణ వరకు వాటిని ఎట్లా రూపొందించుకోవాలో, ఎట్లా నడుపుకోవాలో నిర్ణయించుకునే పూర్తి అధికారం ఆయా కులసంఘాలదే.
– 2023 సెప్టెంబర్‌లో బీసీ ఆత్మగౌరవ భవనాలపై అప్పటి సీఎం కేసీఆర్
కుల సంఘాలకు బాధ్యతలు
బీసీ కులాల సంస్కృతీ, సంప్రదాయాలు ఉట్టిపడేలా భవనాల నమూనాలను రూ పొందించే బాధ్యతను సైతం తెలంగాణ స్టేట ఎడ్యుకేషన్ అండ్ వెల్పేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఈడబ్ల్యూఐడీసీ)కి అప్పగించింది. ఈ మేరకు 2020 నాటికి కార్పొరేషన్ బీసీ ఆత్మగౌరవ భవనా ల నమూనాలను సిద్ధం చేసి ప్రభుత్వానికి అప్పగించింది. అనంతరం 2022లో ప్రతి కులంలోని అన్ని సంఘాలనూ ఏకసంఘం గా ఏర్పాటుకావాలని, అలా ట్రస్ట్‌గా ఏర్పడిన వాటికి ఆత్మగౌరవ భవనాల నిర్మాణం, నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించింది. ఏకసంఘంగా ఏర్పడిన కులాలకు ఆయా స్థలాలను సైతం అప్పగించింది. ఆత్మగౌరవ భవనాల మేనేజింగ్ ట్రస్ట్‌ను ఏర్పాటుచేసింది. ప్రభుత్వమే భవనాలను నిర్మించి ఇవ్వాలని 16 కులాలు, సొంతంగా నిర్మించుకుంటామని మిగతా కులాలు తెలుపగా, ఆ మేరకు ప్రభుత్వం సైతం చర్యలు చేపట్టింది. భవనా ల నిర్మాణ పనులనూ చేపట్టింది. మొత్తంగా భవనాలపై ఆయా కులాలకే పూర్తి అజమాయిషీ కల్పించింది. అప్పటికే కుర్మ యాదవ భవనం పూర్తయింది. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు పూర్తిగా నిలిచిపోయాయి. బడ్జెట్ కేటాయింపులు తప్ప నిధులు విడుదల చేయలేదు.

‘బీసీల ఆత్మగౌరవం’పై సర్కార్ పెత్తనం
ఆత్మగౌరవ భవనాల నిర్మాణం, అనంతరం వాటి నిర్వహణ బాధ్యతలకు సంబంధించిన గత మార్గదర్శకాలన్నింటినీ మా ర్చేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. కు లాలను తప్పించి ప్రభుత్వమే పెత్తనం చెలాయించేలా నూతన నిబంధనలు రూపొందిస్తూ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ చర్యలతో బీసీ ఆత్మగౌరవ భవనాలపై స ర్కార్ పెత్తనం చెలాయించనున్నది. గతం లో ఏర్పాటుచేసిన ట్రస్టుల్లో అన్ని కులాలకు చెందిన అన్ని సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించలేదని, ట్రస్ట్ పదవులను నియమించలేదని, కొన్ని భూములపై న్యాయస్థానాల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని,
ఒకే కులానికి చెందిన వేర్వేరు సంఘాలు, ట్రస్టుల మధ్య విభేదాలున్నాయని, ఈ నేపథ్యంలోనే ఆత్మగౌరవ భవనాల భూముల వినియోగం, నిర్మాణం, నిర్వహణ విషయంలో ఉమ్మడి విధానం కోసం నూతన మార్గదర్శకాలు రూపొందిస్తున్నామంటూ బీసీ సంక్షేమ శాఖ ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపింది. కులాల ప్రాతినిధ్యాన్ని పూర్తిగా నామమాత్రం చేసింది. బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణం, నిర్వహణ తదితర బాధ్యతలను ట్రస్ట్‌కు కాకుండా ప్రత్యేకంగా ఒక నిర్వహణ కమిటీని ఏర్పాటుచేసి, అప్పగించాలని కోరింది. ఆత్మగౌరవ భవనాలకు సంబంధించి నిర్ణయాలన్నింటినీ ఆ కమిటీయే పర్యవేక్షించేలా కొత్తగా నిబంధనలు పొందుపరిచింది. ఆ ప్రతిపాదనలకు ప్రభు త్వం ఆమోదం తెలుపుతూ తాజాగా జీవో 14ను జారీచేసింది. ఆ ఉత్తర్వులను ప్రభుత్వం ఇప్పటికీ గుట్టుగానే ఉంచడం గమనార్హం.
యాజమాన్య కమిటీల ఎంపిక ఇలా..
- ప్రతి ఆత్మగౌరవ భవన నిర్మాణం, నిర్వహణకు ప్రత్యేకంగా ఒక యాజమాన్య క మిటీ ఏర్పాటుకోసం ప్రభుత్వం తొలుత ఒక సెలక్షన్ కమిటీని నియమిస్తుంది.
- ఈ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా బీసీ సంక్షేమ శాఖ మంత్రి వ్యవహరించనుండగా, సభ్యులుగా బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ/ప్రభుత్వ కార్యదర్శి, సంబంధిత కులానికి చెందిన ఎన్నికైన ప్రజాప్రతినిధి లేదంటే ప్రముఖ కుల నాయకుడు, సంబంధిత కులానికి సంబంధించిన కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఉండనున్నారు. బీసీ సంక్షేమశాఖ కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.
- ఈ కమిటీ రాష్ట్రస్థాయిలో ప్రతి ఆత్మగౌరవ భవనానికి సంబంధించి 8 మందితో కూడిన యాజమాన్య కమిటీని మూడేండ్ల కాలపరిమితితో ఏర్పాటు చేయనున్నది. సెలక్షన్ కమిటీకి దీని కాలపరిమితిని పొడిగించే అధికారం ఉన్నది.
- మేనేజ్మెంట్ కమిటీలో ఐదుగురు సభ్యులు నిర్దేశిత కులానికి చెందిన వారు కాగా, ముగ్గురు సభ్యులు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్, సంబంధిత కార్పొరేషన్ ఎండీ, జిల్లా కలెక్టర్ లేదంటే బీసీ అభివృద్ధిశాఖ జిల్లా అధికారి ఉంటారు.
- 5 కుల సభ్యుల్లో ఒకరిని మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్‌గా సెలక్షన్ కమిటీ చైర్మన్ (మంత్రి) నియమిస్తారు.
- ఈ మేనేజ్మెంట్ కమిటీ ప్రతి 3 నెలలకు ఒకసారీ సమావేశమవ్వాలి. మినిట్స్‌ను కమిషనర్‌కు పంపాలి.
- మేనేజ్మెంట్ కమిటీ కేవలం ఆత్మగౌరవ భవనాల కస్టోడియన్‌గా పనిచేయనుండగా, పూర్తి నిర్వహణ, పర్యవేక్షణ కమిషనర్ అజమాయిషీలోనే ఉంటుంది.
- నిర్మాణ పనులు ప్రభుత్వ ఏజెన్సీలకు అప్పగించాలి.
- అంతేకాదు ఇక ఆత్మగౌరవభవనాల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కూడా నూతన మార్గదర్శకానలు ప్రభుత్వం జారీ చేసింది. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ఆత్మగౌరవభవనాల్లో నిర్వహించకూడదు. అలా చేస్తే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ప్రభుత్వం సదరు మేనేజ్మెంట్ కమిటీని రద్దు చేసే అధికారం ఉంటుంది.
- ప్రభుత్వం అనుమతిస్తేనే ఆత్మగౌరవభవనాల్లో వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించవచ్చు. ఆడిట్ రిపోర్టు సమర్పించాలి. ఈ జీవో కాపీని ఇప్పటికీ ప్రభుత్వం బహిర్గత పరచలేదు. గుట్టుగా ఉంచింది.
భగ్గుమన్న బీసీ కులంఘాలు
ప్రభుత్వం గుట్టుగా జారీ చేసిన నూతన మార్గదర్శకాలపై కులసంఘాల నేతలు భగ్గుమంటున్నారు. తెలంగాణ సమాజ నిర్మాణంలో, సంసృతిలో, ఉత్పత్తి రంగంలో వెన్నెముకగా నిలిచిన వెనుకబడిన తరగతుల (బీసీ) ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ సర్కార్ ప్రశ్నార్థకంగా మార్చుతున్నదని నిప్పులు చెరుగుతున్నారు. శతాబ్దాల అణచివేతను ఎదిరించి, తమకంటూ ఒక సామాజిక భద్రతను, అస్తిత్వాన్ని చాటుకోవడానికి ఏర్పడిన ఆత్మగౌరవ భవనాలను కాంగ్రెస్ ప్రభుత్వం నేడు మళ్లీ ప్రభుత్వజోక్యంతో బందీ చేయడం దారుణమని మండిపడుతున్నారు. నూతన మార్గదర్శకాలు బీసీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయడమేగాక, అధికారిక అజమాయషీకి, ప్రభుత్వ ఆధిపత్వానికి బాటలు వేస్తున్నాయని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా తక్షణం సర్కార్ ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
వాటిని కొట్టేసేందుకేనా?
40 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి కేసీఆర్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కోకాపేట, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ భగాయత్ వంటి అత్యంత విలువైన ప్రాంతాల్లో మొత్తంగా 82.30 ఎకరాల భూమిని కేటాయించింది. వాటి విలు వ ప్రస్తుతం రూ.వేల కోట్లలో ఉంటుంది. వీటిపై కాంగ్రెస్ ప్రభుత్వం కన్ను పడిందని, ఎలాగైనా వాటిని కొట్టేసేందుకు ప్లాన్ చేసిందని కుల సంఘాల నాయకులు అనుమానిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పెద్దలు ఎక్కడా ప్రభుత్వ భూములను వదలడం లేదని చెప్తున్నారు. నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కుతూ, వ్యవస్థలన్నింటినీ తమ చెప్పుచేతల్లో పెట్టుకొని వేలాది ఎకరాలను స్వాహా చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇదే తరహాలో బీసీల ఆత్మగౌరవ భవనాలను ముందుగా తమ స్వాధీనంలోకి తీసుకొని, ఆ తర్వాత కాజేసేందుకు ప్రభుత్వ పెద్దలు ప్లాన్ చేశారంటూ మండిపడుతున్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

