సర్వోన్నత న్యాయపీఠంపై తెలుగు తేజం
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) తెలుగువారైన జస్టిస్ నూతలపాటి వెంకట రమణ (జస్టిస్ ఎన్వీ రమణ) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

- సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియామకం
- సీజేఐగా నియమితులైన రెండో తెలుగు వ్యక్తిగా ఘనత
- రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు
- 23న ప్రస్తుత సీజేఐ బోబ్డే పదవీ విరమణ
- 24న జస్టిస్ రమణ ప్రమాణ స్వీకారం
- వచ్చే ఏడాది ఆగస్టు వరకు పదవీ బాధ్యతలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) తెలుగువారైన జస్టిస్ నూతలపాటి వెంకట రమణ (జస్టిస్ ఎన్వీ రమణ) నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే ఈ నెల 23న పదవీ విరమణ చేయనున్నారు. 24న భారత 48వ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం చేయనున్నారు. 2022 ఆగస్టు 26 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. రాష్ట్రపతి సంతకంతో కూడిన నియామక పత్రాన్ని సంప్రదాయం ప్రకారం ప్రధాని ముఖ్యకార్యదర్శి పీకే శర్మ, న్యాయశాఖ కార్యదర్శి బారున్ మిత్రా మంగళవారం ఉదయం జస్టిస్ రమణకు అందజేశారు. తదుపరి సీజేఐగా సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ అయిన జస్టిస్ రమణ పేరును జస్టిస్ బోబ్డే ఇటీవల కేంద్రప్రభుత్వానికి సిఫార్సు చేశారు. కేంద్ర న్యాయశాఖ దీనిని రాష్ట్రపతికి పంపగా.. ఆయన తాజాగా ఆమోదముద్ర వేశారు. సుప్రీంకోర్టు సీజేఐగా నియమితులైన రెండో తెలుగు వ్యక్తి జస్టిస్ రమణ. ఇంతకుముందు జస్టిస్ కోకా సుబ్బారావు 1966 జూన్ 30 నుంచి 1967 ఏప్రిల్ 11 వరకు సీజేఐగా వ్యవహరించారు.
వ్యవసాయ కుటుంబం నుంచి..
ఏపీలోని కృష్ణా జిల్లా పొన్నవరంలో ఒక వ్యవసాయ కుటుంబంలో నూతలపాటి వెంకట రమణ 1957 ఆగస్టు 27న జన్మించారు. తండ్రి గణపతిరావు. తల్లి సరోజిని. కంచికచర్లలో ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం చేశారు. అమరావతిలోని ఆర్వీవీఎన్ కళాశాలలో బీఎస్సీ చదివారు. 1982లో నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా అందుకున్నారు. 1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. న్యాయవాదిగా సేవలందించారు. 2000 జూన్ 27న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకు ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2013 సెప్టెంబర్ 2న ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
కీలక తీర్పులు..
- సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ పలు కీలక తీర్పులు వెలువరించారు.
- పారదర్శకతకు ప్రాణం పోస్తూ.. సీజేఐ కార్యాలయం కూడా ఆర్టీఐ పరిధిలోకి వస్తుందని గతేడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ ఎన్వీ రమణ కూడా ఉన్నారు.
- ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల సత్వర విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని గతేడాది సెప్టెంబర్‌లో రాష్ర్టాల హైకోర్టులను ధర్మాసనం ఆదేశించింది.
- జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు అనంతరం అక్కడ ఇంటర్నెట్ సేవలను నిషేధించడంపై జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ఇంటర్నెట్ రద్దు నిర్ణయాన్ని తక్షణమే సమీక్షించాలని జమ్ముకశ్మీర్ యంత్రాంగాన్ని ఆదేశించింది.
- ఆర్టికల్ 370ని రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసేందుకు జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గతేడాది నిరాకరించింది.
- 2016లో అరుణాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరిస్తూ చారిత్రక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ ఎన్వీ రమణ కూడా ఉన్నారు. ప్రభుత్వ పతనానికి కారణమైన గవర్నర్ నిర్ణయాలను కోర్టు రద్దు చేసింది.
- 2019లో అప్పటి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ను అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని జస్టిస్ రమణ ధర్మాసనం ఆదేశించింది. జాప్యం చేస్తే ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నించే అవకాశమున్నదని వ్యాఖ్యానించింది.
ఇవి కూడా చదవండి..
మధ్యవర్తులను ప్రకటిస్తే జవాన్‌ను అప్పగిస్తాం
బీజేపీ ఎంపీని ఘెరావ్ చేసిన రైతులు
పంజాబ్ నుంచి యూపీకి గ్యాంగ్‌స్టర్ తరలింపు
మీలాగే.. మేం హిందువులకు పిలుపునిస్తే..
పోలింగ్ ప్రశాంతం.. తీర్పు నిక్షిప్తం
Read Today's Latest Top-slides News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

