Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Devaragattu Banni Utsavam | దేవరగట్టు బన్నీ ఉత్సవంలో ఉత్సవ విగ్రహాల కోసం భక్తులు కర్రలతో ఎందుకు తలపడతారు? గెలిచిన గ్రామానికి ఏం లభిస్తుందని నమ్ముతారు? సంప్రదాయం వెనుక కథ, స్థానిక విశ్వాసాలు, ప్రమాదాల వివరాలు తెలుసుకోండి.
Devaragattu Banni Utsavam | దసరా వచ్చిందంటే దేశవ్యాప్తంగా రావణ దహనాలు, అమ్మవారి పూజలు, జమ్మి పంచుకోవడం వంటి వేడుకలే కనిపిస్తాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా దేవరగట్టులో మాత్రం విజయదశమి రాత్రి ఓ విభిన్నమైన సంప్రదాయం కొనసాగుతోంది. ఆ రోజు వేలాది మంది భక్తులు ఒక్కచోట చేరి, ఉత్సవ విగ్రహాలను తమ గ్రామానికి తీసుకెళ్లేందుకు కర్రలతో తలబడుతుంటారు. ఈ క్రమంలో గాయాలై రక్తం కారుతున్నా వారు వినక్కి తగ్గరు. మరి ఆ బన్నీ ఉత్సవం గురించి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..!
దేవరగట్టు ఉత్సవం అంటే ఏంటి?
కర్నూలు జిల్లా హొళగుంద మండలంలోని దేవరగట్టులో శ్రీ మాలమల్లేశ్వర స్వామి ఆలయం వద్ద బన్నీ ఉత్సవం నిర్వహిస్తారు. విజయదశమి సందర్భంగా జరిగే ఈ వేడుకకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. స్థానిక సంప్రదాయం ప్రకారం శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం విజయదశమి రాత్రి స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొస్తారు. ఆ సమయంలో వివిధ గ్రామాలకు చెందిన భక్తులు రెండు వర్గాలుగా విడిపోయి విగ్రహాలను తమ గ్రామానికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో బన్నీ ఉత్సవంలో ప్రధాన ఘట్టమైన కర్రల పోరు మొదలవుతుంది.
కర్రలతో తలపడటం వెనుక పురాణగాథ
ఈ కర్రల సమరం వెనుక ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది. ఒకప్పుడు మణి, మల్లాసరులు అనే రాక్షసులు దేవరగట్టు ప్రాంతంలోని సాధువులను, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుండేవారు. ఆ సమయంలో శివుడు భైరవ రూపంలో పార్వతీదేవితో కలిసి వచ్చి వారిని సంహరించారని భక్తులు విశ్వసిస్తారు. చెడుపై దైవం సాధించిన విజయానికి ప్రతీకగా.. ఆ ఘట్టానికి గుర్తుగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ పురాణగాథను ప్రతిబింబించేలా భక్తులు కర్రలతో తలపడే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కారణంగానే బన్నీ ఉత్సవం సాధారణ దసరా వేడుకలకు భిన్నంగా కనిపిస్తుంది. ఈ పోరులో పాల్గొనే వివిధ గ్రామస్తులు ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్తుంటారు. దీనివల్ల తమ గ్రామానికి స్వామి వారి అనుగ్రహం లభిస్తుందని, గ్రామంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని విశ్వసిస్తుంటారు.
అయితే, విగ్రహాలను రక్షించుకోవడానికి సాగే ఈ కర్రల సమరం.. కాలక్రమేణ తమ గ్రామ గౌరవాన్ని నిలబెట్టుకునే ప్రతిష్టాత్మక అంశంగా మారింది. అందుకే ఎంతటి ప్రమాదం ఉన్నా ఈ సంప్రదాయాన్ని విడిచిపెట్టేందుకు స్థానికులు ఇష్టపడటం లేదు. దీంతో ఈ ఉత్సవం చాలా సందర్భాల్లో హింసాత్మకంగా మారుతోంది. 2025లో జరిగిన బన్నీ ఉత్సవంలో 100 మందికి పైగా గాయపడ్డారు. 2024లో 70 మంది గాయపడగా.. 2023లోనూ ఇలాగే హింస చెలరేగింది. ఈ క్రమంలో ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా, ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, పోలీసు అధికారులు సూచించారు. వ్యక్తిగత కక్షలు, గ్రామాల మధ్య విభేదాలకు ఈ వేడుకను వేదికగా మార్చుకోవద్దని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి ఘర్షణలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
Honey Trap | యువతిగా నటిస్తూ యువకులతో పరిచయం పెంచుకుని..
Horoscope | 20-10-2026 మంగళవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

