ఒక్క రోజులో లక్ష కరోనా కేసులు.. దేశంలో తొలిసారి
లక్ష కరోనా కేసులు | దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పంజావిసిరింది. రెండో దశలో ప్రాణాంతక వైరస్ ర్యాపిడ్ స్పీడ్‌తో విజృంభిస్తున్నది. దీంతో దేశంలో కొత్తగా లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులో లక్ష కేసులు నమోదవడం ఇదే మొదటిసారి.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మరోసారి పంజావిసిరింది. రెండో దశలో ప్రాణాంతక వైరస్ ర్యాపిడ్ స్పీడ్‌తో విజృంభిస్తున్నది. దీంతో దేశంలో కొత్తగా లక్షకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజులో లక్ష కేసులు నమోదవడం ఇదే మొదటిసారి.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,03,558 మంది కరోనా పాజిటివ్‌లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,25,89,067కు చేరింది. ఇందులో 1,16,82,136 మంది మహమ్మారి బారినుంచి కోలుకోగా, 1,65,101 మంది బాధితులు మరణించారు. రోజువారీ కేసులు భారీగా నమోదవుతుండటంతో రోజురోజుకు యాక్టివ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. దేశంలో ప్రస్తుతం 7,41,830 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 52,847 మంది వైరస్‌నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా మరో 478 మంది మరణించారని వెల్లడించింది. దేశంలో ఇప్పటివరకు 7,91,05,163 మందికి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశామని తెలిపింది.

10 రెట్లు పెరిగిన కేసులు
కేవలం నెలన్నర వ్యవధిలోనే పాజిటివ్ కేసులు పది రెట్లకుపైగా పెరిగాయి. ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా 9121 కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ ఒకటి నాటికి ఈ సంఖ్య 90 వేలు దాటింది. రోజువారీ కేసులు ఇంత భారీగా నమోదవడం గతేడాది సెప్టెంబర్ తర్వాత ఇదే మొదటిసారి. గత కొన్నిరోజులుగా మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో ఒక్క మహారాష్ట్రలోనే 57 వేలకు పైగా ఉండటం గమనార్హం. మొత్తంగా పది రాష్ట్రాల్లోనే 91 శాతం కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఎస్‌హెచ్‌జీలకు రికార్డు రుణాలు
మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ
కంటైన్మెంట్ జోన్‌గా జోధ్‌పూర్ ఐఐటీ
రాష్ట్రంలో మండుతున్న ఎండలు..
పిల్లలు వద్దు! కరోనా వల్ల జననాల రేటులో భారీ తగ్గుదల
అండం, శుక్ర కణం లేకుండానే పిల్లల్ని పుట్టించొచ్చు.. సరికొత్త పరిశోధన
చిట్టి బుర్రల గట్టి ఆవిష్కరణలు
ఎస్‌హెచ్‌జీలకు రికార్డు రుణాలు
Read Today's Latest Top-slides News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

