హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకం జాతికి నూతన ఆవిష్కరణ అని పలువురు ఆర్థిక, సామాజిక, రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. శతాబ్దాల అణచివేతకు గురైన దళితవర్గాల ఆర్థికాభ్యున్నతికి, సామాజిక సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం గొప్ప ముం దడుగు వేసిందని చెప్పారు. హుజూరాబాద్‌లో మొదలైన దళిత ఆర్థిక విప్లవం దేశవ్యాప్తంగా విస్తరించాలని ఆకాంక్షించారు. గురువారం సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన వెబినార్‌లో పా ల్గొన్న వివిధ రాష్ర్టాలకు చెందిన సామాజికవేత్తలు, ప్రొఫెసర్లు, అధ్యయనవేత్తలు దళితబంధును స్వాగతించారు. తెలంగాణతోపాటు ఢిల్లీ, తమిళనాడు, హర్యానా, బెంగళూరు, ఒడిశా, పంజాబ్ రాష్ర్టాల సామాజిక, ఆర్థికవేత్తలు పాల్గొన్న ఈ వెబినార్‌కు సీనియర్ జర్నలిస్ట్ కే రామచంద్రమూర్తి వందన సమర్పణ చేశారు. మల్లేపల్లి లక్ష్మయ్య ప్రా రంభోపన్యాసం చేస్తూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతోపాటు దళితబంధు ప థకం నేపథ్యాన్ని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ చట్టం తెచ్చి దేశానికే మార్గదర్శ నం చేసిందన్నారు. దళితవర్గాల అభ్యున్నతికి విద్య, వైద్యరంగాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించారు.
సాహసోపేత నిర్ణయం
దళితబంధు పథకం దేశంలో సామాజిక మార్పు తెస్తుంది. ప్రజలను ప్రత్యేకించి అణగారిన దళితవర్గాలను ‘ఉపాధిహామీ పథకం’ కూలీలుగా మారిస్తే, తెలంగాణ ప్రభుత్వం అదే వర్గాలను వ్యాపారవేత్తలుగా మార్చేలా అడుగులేయడం ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రభుత్వమే దళిత కుటుంబాలకు పెట్టుబడి పెట్టి, వారిని వ్యాపారవేత్తలుగా మార్చాలన్న ఆలోచన అద్భుతం. ఉత్పత్తి కులాలను ఉత్పాదకవర్గాలుగా తీర్చిదిద్దటమనే ఆలోచన గొప్పది. సాహసోపేత నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు.
-కేఎస్ గోపాల్, సెంటర్‌ఫర్ ,ఎన్విరాన్మెంట్ స్టడీస్, హైదారాబాద్
అణగారిన వర్గాలకు ఆత్మవిశ్వాసం
దళితబంధు అణగారిన వర్గాలకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. వ్యాపారరంగంలో ఉన్న వర్గాలకు రూ.10 లక్షలు పెద్ద అమౌంట్ కాకపోవచ్చు. ఇప్పటివరకు వ్యాపారచట్రంలోకి రాని గ్రామీణ దళితవర్గాలకు అది పెద్దమొత్తం. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. లక్ష్యసాధన చివరి అంకం వరకు అదే స్ఫూర్తితో కొనసాగాలి.
-విజయ్మహాజన్, రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ డైరెక్టర్, ఢిల్లీ
సాంస్కృతిక పేదరికాన్ని బద్దలు కొడుతుంది
సాంస్కృతిక పేదరికాన్ని దళితబం ధు బద్దలు కొడుతుంది. తెలంగాణ తలసరి ఆదాయం, ఆర్థిక క్రమశిక్షణ లో అగ్రభాగాన నిలిచింది. దేశ ఆర్థిక వ్యవస్థలో తన పాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నది. ఈ పథకా న్ని ముందుగా ఒక గ్రామం, తర్వాత నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్‌గా చేపట్టడం శుభపరిణామం. రూ.10 లక్షలు చిన్నమొత్తం కాదు. పథకం సక్సెస్ అయితే గ్రామీణ ఆర్థిక వ్య వస్థ కొత్తపుంతలు తొక్కుతుంది.
-కేఎస్ చలం, తమిళనాడు
అసాధారణ పథకం
ఇది అసాధారణ పథకం. ప్రభుత్వం కుటుంబానికి రూ.10 లక్షలు గ్రాంట్‌గా ఇవ్వడం దేశంలో ఇప్పటివరకు ఎక్కడా అమలు కాలేదు. దీని విజయావకాశాలపై దేశ దళిత చరిత్ర ఆధారపడి ఉన్నది. ప్రభుత్వం గ్రాంట్‌గా ఇవ్వడం శుభపరిణామం.
-బర్కా చాబ్రా, సామాజికవేత్త
నిధుల విడుదలే తొలివిజయం
దళితబంధుకు బడ్జెట్లో వెయ్యికోట్లు కేటాయించిన కొద్దిరోజులకే, పైలట్ ప్రాజెక్టుగా రూ.2 వేల కోట్లు విడుదలచేయటంతో ప్రభుత్వ ప్రాధాన్యం స్పష్టమవుతున్నది. దేశమంతా తెలంగాణవైపు చూస్తున్నది. -నీలాల ఆచార్య, ఫెలో సెంటర్ ఫర్ బడ్జెట్ అండ్ గవర్నెన్స్ అకౌంటబులిటీ
రాజ్యాంగ విలువలకు దక్కిన గౌరవం
రాజ్యాంగంలోని 46వ ఆర్టికల్‌కు తెలంగాణ ప్రభుత్వం నిజమైన విలువ ఇచ్చింది. ఈ అవకాశాన్ని దళితులు భయపడకుండా సద్వినియోగం చేసుకోవాలి. ఈ ఉత్సాహాన్ని చివరి వరకు కొనసాగించాలి. నైపుణ్యాలను వృద్ధి చేసుకోవాలి.
-డాక్టర్ రాజశేఖర్, హర్యానా ప్రభుత్వ అడిషనల్ సీఎస్
మిగతా వర్గాలు సహకరించాలి
దేశంలో అణగారిన, అణచివేతకు గురైన దళితులను అభివృద్ధి చేయాలన్నది గొప్ప ఆలోచన. దళితేతర వర్గాలు తోడ్పాటు అందించాలి. సహకరించాలి. స్వాగతించాలి.
-బాలాజీ ఊట్ల, సామాజికవేత్త
పౌరసమాజం వాచ్‌డాగ్‌లా ఉండాలి
ప్రజా ఉద్యమాలకు, ప్రజాస్వామిక విలువలకు తెలంగాణ గొప్ప స్ఫూర్తి. పథకం విజయవంతానికి పౌరసమాజం వాచ్‌డాగ్‌లాగా పనిచేయాలి. ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి.
-ప్రొఫెసర్ అమిత్ థోరట్, జేఎన్‌యూ, ఢిల్లీ
దక్షిణభారతంపై తక్షణ ఒత్తిడి
దళితబంధు ప్రభావం ఉత్తరభారత్‌లో కంటే దక్షిణభారత్‌లో తక్షణ ఒత్తిడి తెస్తున్నది. ఈ పథకంపై తమిళనాడు, కర్ణాటకలలో విస్తృత చర్చ జరుగుతున్నది.