హైదరాబాద్, ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): కొవిడ్ కేసులు పెరిగేకొద్దీ దేశంలో మరికొన్ని కొత్తరకం కరోనా వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం ఉన్నదని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేశ్ మిశ్రా అన్నారు. వచ్చే మూడు వారాలు భారత్‌కు అత్యంత కీలకమని.. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలంటే ప్రతి ఒక రూ తప్పనిసరిగా కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అందరూ మాస్క్ ధరిస్తే 99 శాతం రక్షణ ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. భారత్‌లో కరోనా తీవ్రతరం అవుతున్నదని, వైరస్ ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందుతున్నదని తెలిపారు. ‘వైరస్ ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందుతున్నది. ఈ క్రమం లో కొన్ని రకాలు బలహీనంగా ఉండి కనుమరుగైతే.. మరికొన్ని ఎకువ ప్రభావం చూపుతూ వ్యాప్తిలో ఉంటాయి. ప్రస్తుతం దేశంలో రోజుకు రెండున్నర లక్షలపైన పాజిటివ్ కేసులు బయట పడుతుండటంతో కొత్తరకం కరోనా వైరస్లు పుట్టుకొస్తున్నాయి. ఆయా నమూనాల నుంచి వైరస్ జన్యుక్రమం ఆవిషరించే పరిశోధనలు సాగుతున్నాయి. కొత్త రకాల్లో ఎకువ ఉత్పరివర్తనాలు ఉంటున్నాయా? వ్యాప్తి పెరగడంలో ఇవి ఎంతమాత్రం పనిచేస్తున్నాయి? అనేదానిపై పరిశీలిస్తున్నాం. బీ.1.617 రకం ఇతర వైరస్ రకాల కంటే ఎకువ వ్యాప్తికి కారణం అవుతుందనడానికి తగిన ఆధారాలు లేవు. దేశవ్యాప్తంగా దీని వ్యాప్తి ప్రస్తుతం 10 శాతంలోపే ఉన్నది. ఈ 484 క్యూ, ఎల్ 452 ఆర్ మ్యుటేషన్లతోపాటు మరికొన్ని బీ.1.617లో ఉన్నాయి. భారత్‌లో ఈ రకం అక్టోబర్‌లో బయటపడింది. అప్పట్లో ప్రజల జాగ్రత్తలతో వ్యాప్తి పెద్దగా లేదు. రెండు నెలలుగా చాలామంది మాస్ లేకుండా తిరగడం, టీకా వచ్చిందని జాగ్రత్తలను విస్మరించడం.. కేసులు పెరగడానికి దారితీసింది’ అని రాకేశ్‌మిశ్రా వివరించారు.
మాస్కే శ్రీరామ రక్ష…
గతేడాది ఇటలీలో వైద్యం, ఆక్సిజన్ అందక చాలామంది ప్రాణాలు కోల్పోయిన విషయం గుర్తుంచుకోవాలని రాకేశ్ మిశ్రా సూచించారు. ‘భారత్‌లో రెండో ఉదృ్ధతిపై కొన్ని నెలలుగా ఆరోగ్యరంగ నిపుణులు చెప్తూనే ఉన్నారు. టీకా తీసుకున్నా ముఖానికి మాస్ ధరించాల్సిందే. పార్టీల ర్యాలీలు, మతపరమైన మేళాలు అత్యంత ప్రమాదకరం. వీటితోనే ఎక్కువమందికి వైరస్ వ్యాపించే అవకాశమున్నది. గాలినుంచి వైరస్ వ్యాప్తి చెం దుతున్నది. భవనాలు, మూసిఉండే ప్రదేశాల్లో 20అడుగుల దూరం వ్యాపిస్తున్నది. మాస్ ధరి స్తే 80శాతం రక్షణ ఉంటుంది. అందరూ ధరిస్తే 99శాతం రక్షణ లభిస్తుంది’ అని వివరించారు.