హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసు దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌లో శుక్రవారం తనిఖీలు నిర్వహిస్తున్న ఏపీ సీఐడీ అధికారులను ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ మీడియా సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ అడ్డుకోవడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఐపీసీ 353, 341, 186, 120(బీ) సెక్షన్ల కింద రాధాకృష్ణపై కేసు నమోదుచేసినట్టు సీఐడీ అధికారులు తెలిపారు. కేసు తదుపరి విచారణ కోసం తెలంగాణకు సీఐడీ బదిలీ చేయనున్నది. అవినీతికి పాల్పడ్డ వారి ఇండ్లలో అధికారులు దర్యాప్తు చేస్తుండగా రాధాకృష్ణ అడ్డుకోవడానికి య త్నించడంతో తీవ్ర ఒత్తిడి మధ్యనే సీఐడీ అధికారులు పంచనామా పూర్తిచేసినట్లు సీఐడీ పేర్కొన్నది. ఈ కేసు లో ముగ్గురికి ఏసీబీ కోర్టు రెండువారాల రిమాండ్ విధించింది. నిందితులు సౌమ్యాద్రి, ముఖేశ్, వికాస్ ను కొవిడ్ పరీక్షల కోసం మచిలీపట్నం తీసుకెళ్లారు. అనంతరం విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కా ర్పొరేషన్‌లో జరిగిన కుంభకోణంపై సీఐడీ అధికారు లు ఆదివారం రెండోరోజు దర్యాప్తు కొనసాగించారు. హైదరాబాద్‌తోపాటు పూణె, ముంబై, ఢిల్లీలోని షెల్ కంపెనీల రికార్డులను పరిశీలించి, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ, సీఈవోగా వ్యవహరించిన గంటా సుబ్బారావు, డైరెక్టర్ జే లక్ష్మీనారాయణలతోపాటు 26 మందిపై సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.