జాంబియా మహిళకు కిమ్స్‌లో అరుదైన శస్త్రచికిత్స
అత్యంత అరుదైన పారాగాంగ్లియోమా అనే కణితితో బాధపడుతున్న జాంబియా దేశస్థురాలికి నగరంలోని కిమ్స్ దవాఖానలో విజయవంతంగా వైద్యు లు శస్త్రచికిత్స చేశారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 1 (నమస్తే తెలంగాణ): అత్యంత అరుదైన పారాగాంగ్లియోమా అనే కణితితో బాధపడుతున్న జాంబియా దేశస్థురాలికి నగరంలోని కిమ్స్ దవాఖానలో విజయవంతంగా వైద్యు లు శస్త్రచికిత్స చేశారు. ఈ కణితి ప్రపంచంలోనే పది లక్షల మందిలో ఇద్దరికి మాత్రమే వస్తుందని వైద్యులు తెలిపారు. కేసు వివరాలను ఎండోక్రైన్ శస్త్రచికిత్స నిపుణురాలు డాక్టర్ రమ్య వెల్లడించారు. జాంబియా దేశానికి చెందిన 40 ఏండ్ల మహిళ ఐదేండ్లుగా నియంత్రణ లేని రక్తపోటు, తీవ్ర తలనొప్పి, గుండె దడ వంటి సమస్యలతో బాధపడుతున్నది. స్థానికంగా ఎన్ని దవాఖానలు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. జాంబియా ప్రభుత్వం రోగిని నగరంలోని కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్‌కు రెఫర్ చేసింది. వైద్యపరీక్షలు జరపగా, ఆమె ఉదర భాగంలో కణితి (8.5×7.5 సెం.మీ.) ఉన్నట్టు గుర్తించారు. విజయవంతంగా శస్త్రచికిత్స చేసి, కణితిని తొలిగించారు. రోగి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో డిశ్చార్జ్ చేశారు. ఈ శస్త్రచికిత్సలో డాక్టర్ వీరభద్రరావుతో పాటు పలువురు వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

