నాంపల్లి క్రిమినల్ కోర్టులు, మార్చి 29 (నమస్తే తెలంగాణ): లైంగిక దాడి కేసులో యూట్యూబర్ చలమల్ల శంకర్‌గౌడ్‌ను 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ 14వ అదనపు చీఫ్ మెజిస్ట్రేట్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు.
అంబర్‌పేటకు చెందిన మహిళపై లైంగికదాడి చేసినట్టు పోలీసులు కేసు డైరీలో పేర్కొన్నారు. పెళ్లికి నిరాకరించడంతోపాటు, బెదిరించినట్టు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి.. కోర్టు ఎదుట హాజరుపర్చగా కోర్టు రిమాండ్ విధించినట్టు తెలిపారు. నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.