గురువారం 04 జూన్ 2020
Telangana - Jan 12, 2020 ,

ఉద్యోగ భద్రతే ముఖ్యం

ఉద్యోగ భద్రతే ముఖ్యం

‘ఉక్కునరాలు, ఇనుప కండరాలు, దృఢసంకల్పం, మొక్కవోని విశ్వాసం గల వందమంది యువకులు చాలు.. యావత్‌ ప్రపంచగతిని మార్చేయవచ్చు’ అంటారు స్వామి వివేకానంద.

  • ప్రైవేట్‌ కంటే ప్రభుత్వరంగమే ముద్దు
  • వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సర్వేలో యువత మనోగతం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ‘ఉక్కునరాలు, ఇనుప కండరాలు, దృఢసంకల్పం, మొక్కవోని విశ్వాసం గల వందమంది యువకులు చాలు.. యావత్‌ ప్రపంచగతిని మార్చేయవచ్చు’ అంటారు స్వామి వివేకానంద.  దేశంలోని 130 కోట్ల జనాభాలో దాదాపు సగం మంది 25 ఏండ్ల వయస్సులోపువారే. ‘భారత యువత భవిష్యత్‌ కోరికలు, లక్ష్యాలు’ అనే అంశంపై ఇటీవల వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం నిర్వహించిన దేశవ్యాప్త సర్వేలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ సర్వేలో 15-35 ఏండ్ల వయసువారిని ప్రశ్నించింది. దీని ఆధారంగా యువత ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిష్కారమార్గాలను సూచిస్తూ ఒక నివేదికను రూపొందించింది. నేడు స్వామి వివేకానంద జన్మదినం ‘నేషనల్‌ యూత్‌ డే’ సందర్భంగా ఆ వివరాలు.. 

భారతీయ యువతలో 37శాతం మంది విద్య, ఉద్యోగాల విషయంలో స్వేచ్ఛగా ఆలోచిస్తున్నారు. తల్లిదండ్రుల  పాత్ర క్రమంగా తగ్గుతున్నది.తమకు అనువైన చదువులు, ఉద్యోగాల విషయంలో సరైన మార్గదర్శనం లేక యువత ఇబ్బంది పడుతున్నది. 51% మంది యువతకు

తమ నైపుణ్యాలు, విద్యార్హతలకు తగిన ఉద్యోగ సమాచారం అందుబాటు లేదు.

స్టార్టప్‌లకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సా హం యువతను ఆకర్షిస్తున్నది. సొంత వ్యాపా రం చేయాలనే లక్ష్యంతో 67% మహిళలు, 75% పురుషులు  ఉన్నా.. తగిన అర్హతలు, నైపుణ్యాలు, ప్రణాళికలు 44% మంది దగ్గరే ఉన్నాయి. ప్రస్తుతం ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నవారిలో భవిష్యత్‌లో సొంతంగా బిజినెస్‌ చేసుకోవాలనే తపన పెరుగుతున్నది.

  •  మంచి ఉద్యోగం పొందాలంటే పీజీ ఉం డాలని 84% మంది భావిస్తున్నారు. ఇందు లో 76% మంది పీజీతోపాటు ఇతర నైపుణ్యాలు కూడా పెంచుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. ఉచితంగా శిక్షణ కేంద్రాలకు నిర్వహిస్తే మేలని ఎక్కువ మంది కోరుతున్నారు.
  •  ఉద్యోగ భద్రతకు, ఉన్నతస్థితికి ప్రభుత్వరంగమే ఉత్తమమని 49% మంది భావిస్తుండగా,  23% మంది ప్రైవేట్‌రంగం వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రైవేట్‌రంగంలో పనిచేసేవారిలో 63% మంది జీతాలకు, ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. 
  •  81శాతం మంది విద్యా, ఉద్యోగ సమాచారం కోసం ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా మీద ఆధారపడుతున్నారు.


ప్రైవేట్‌ సంస్థ సర్వేలో వెల్లడైన అంశాలు


  •  41శాతం సంతోషంగా జీవించాలని, 30 శాతం మంది శ్రీమంతులుగా ఎదుగాలని కోరుకుంటున్నారు.
  •  70 శాతం మంది 70శాతం సమయా న్ని సోషల్‌ మీడియాలో గడుపుతున్నారు.
  • ఇంటర్‌నెట్‌ వినియోగదారుల్లో 76 శాతం మంది 35 ఏండ్లలోపువారే.
  • ఇన్‌స్టాగ్రామ్‌ వాడకందారుల్లో 51శాతం మంది 18నుంచి 24 ఏండ్లలోపువారే.
  • 23 శాతం మంది విద్యార్థులు వైద్యులుగా, 23 శాతం మంది ఇంజినీర్లుగా, 16 శాతం మంది సాఫ్ట్‌వేర్లు కావాలనేది కోరిక.


logo