జనగామ : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కూటికంటి నరేశ్ గౌడ్ నేతృత్వంలో యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కోడకండ్ల మండలం, పాఖాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పుగల్ల యాకయ్య, కొంగరి శ్రీను, అలాగే ఏడునూతల గ్రామానికీ చెందిన కాంగ్రెస్ నాయకులు నాయకులు, కార్యకర్తలు పెద్ద వంగర మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli )సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండల పార్టీ అధ్యక్షుడు నవీన్, పాలకుర్తి సర్పంచ్ యాకాంతరావు, తదితరులు పొల్గొన్నారు.