యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది.. అక్కడికక్కడే మృతి.. జడ్చర్లలో దారుణం
పట్టపగలు.. నడిరోడ్డుపై ఓ యువకుడు కత్తితో యువతి గొంతు కోయడంతో మృతిచెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో కలకలంరేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జడ్చర్ల పట్టణంలోని నిమ్మబావిగడ్డ ప్రాంతంలో నివసిస్తున్న వైష్ణవి (24) పోలేపల్లి సెజ్ ప్రాంతంలోని ఎస్వీకేఎం స్కూల్లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్నది.
- యువకుడిని చితకబాదిన స్థానికులు
- దవాఖానకు తరలింపు.. పరిస్థితి విషమం
జడ్చర్ల టౌన్, మే 16 : పట్టపగలు.. నడిరోడ్డుపై ఓ యువకుడు కత్తితో యువతి గొంతు కోయడంతో మృతిచెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో కలకలంరేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జడ్చర్ల పట్టణంలోని నిమ్మబావిగడ్డ ప్రాంతంలో నివసిస్తున్న వైష్ణవి (24) పోలేపల్లి సెజ్ ప్రాంతంలోని ఎస్వీకేఎం స్కూల్లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్నది. శనివారం సాయంత్రం పాఠశాలలో విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరింది. కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్న ఓ యువకుడు వైష్ణవి ఇంటి సమీపంలో కాపుకాశాడు.
ఒంటరిగా వెళ్తున్న యువతిని అడ్డగించి కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడిక్కడే మృతిచెందింది. స్థానికులు యువకుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. పోలీసులు గాయపడిన యువకుడిని మహబూబ్‌నగర్ దవాఖానకు తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

