ఉప్పల్, డిసెంబర్ 26: హైదరాబాద్ నగరంలోని నాచారం పరిధిలో నివాసముండే ఓ యువతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. తన తండ్రి కేసు విషయంలో విచారణ నిమిత్తం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారనే తనువు చాలించిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాచారం సరస్వతినగర్‌లో దీప్తి (29) తన తల్లితో కలిసి నివసిస్తున్నది. ఎమ్మెస్సీ చదివిన దీప్తి ఐఐసీటీలో ఉద్యోగం చేస్తున్నది. ఆమె తండ్రి సంగీతరావు ఐఐసీటీలో పనిచేసి రిటైరయ్యాడు. రెండేండ్లుగా ఆయన తన కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. వీరి ఇంటికి సమీపంలో ఉండే డీజీపీ కార్యాలయంలో పనిచేసే కానిస్టేబుల్ అనిల్ నివసిస్తున్నాడు.
తన భార్య అనితకు ఉద్యోగం ఇప్పిస్తానని సంగీతరావు రూ.15 లక్షలు తీసుకున్నాడని, పలుమార్లు అడుగడంతో రూ.7 లక్షలు ఇచ్చాడని, ఇంకా ఇవ్వాల్సిన రూ.8 లక్షలను ఇవ్వడంలేదనీ నాచారం పోలీస్‌స్టేషన్‌లో అనిల్ ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై పోలీసులు సంగీతరావు భార్యను, ఆయన కూతురు దీప్తిని విచారణ కోసం పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి దీప్తి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. తన తండ్రి తీసుకున్న డబ్బు విషయమై తనను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి అడగడంతోనే మనస్తాపానికి గురైనట్టు తెలుస్తున్నది.