మెదక్ మున్సిపాలిటీ : ఈ నెల 27న వరంగల్( Warangal) జిల్లా ఎల్కతుర్తిలో జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు (Silver Jubilee Mahasabha) మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం బూరుగడ్డ గ్రామానికి చెందిన యువకుడు గడ్డమీది రవి ( Ravi ) గురువారం ఉదయం పాదయాత్రగా ( Marches ) బయలుదేరారు. మధ్యాహ్నం మెదక్ పట్టణానికి చేరుకోగా పట్టణ బీఆర్ఎస్ కన్వీనర్ మామిళ్ల అంజనేయులు, తదితరులు రవికి ఘన స్వాగతం పలికారు.
అనంతరం జిల్లా బీఆర్ఎస్ ( BRS ) కార్యాలయానికి తీసుకెళ్లి శాలువాతో సన్మానించి అభినందించారు. ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( KCR ) పై అభిమానంతోనే ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు పాదయాత్రగా వెళ్లుతున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దరన్నారు. బడుగు, బలహీన వర్గాల వారి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు.
సాధ్యం కాని హామీలతో గద్దనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేరవేర్చక నయవంచనకు పాల్పడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చిన గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి శూన్యమని, తిరిగి కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.