కొత్తూరు, ఏప్రిల్ 22: ఉరేసుకొని ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధాపూర్లో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. గ్రామానికి చెందిన గుండెమోని అంజయ్య చిన్న కొడుకు ప్రవీణ్ ఆదివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అంజయ్య ఉదయం తన పొలంలోని పశువుల కొట్టం వద్దకు వెళ్లి చూడగా.. అక్కడే ఉన్న చింతచెట్టుకు ప్రవీణ్ ఉరేసుకొని వేలాడుతూ కనిపించాడు. బోరున విలపిస్తూ.. స్థానికుల సహాయంతో ప్రవీణ్ మృతదేహాన్ని చెట్టుపై నుంచి కిం దికి దించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై జీ శ్రీనివాస్ తెలిపారు.