హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : మీరు.. ఎప్‌సెట్ వెబ్ కౌన్సెలింగ్‌కు హాజరయ్యారా..? అయితే మీకు ఏ కాలేజీలో సీటు రాబోతున్నదో మీరు ముందే తెలుసుకోవచ్చు. సీటు నచ్చకపోతే కావాలంటే వెబ్ ఆప్షన్లలో మార్పులు కూడా చేసుకోవచ్చు. సీటు రానివారు ఖాళీగా ఉన్న కాలేజీలో సీట్లను ఎంపికచేసుకోవచ్చు. శనివారం మాక్ సీట్ల కేటాయింపును అధికారులు పూర్తిచేశారు.
మొత్తం 95,256 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాగా, వీరిలో 94,059 మంది వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు. 83,0 54 సీట్లుండగా, 77,154 సీట్లు నిండాయి. 5,900 సీట్లు ఖాళీగా ఉండటం గమనార్హం. 16,905 మంది వెబ్ ఆప్షన్లు ఎంపికచేసిన కాలేజీల్లో వారి ముందు ర్యాంకువారు సీట్లు దక్కించుకోవడంతో ఆయా విద్యార్థులు సీట్లు దక్కించుకోలేకపోయారు. 15లోపు వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చని ఎప్‌సెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ ఏ శ్రీదేవసేన తెలిపారు.