హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వానలు పడే అవకాశమున్నట్టు తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. రాబోయే రెండు రోజుల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములు గు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని పేర్కొంది. గడిచిన 24 గంటల్లో ములుగు జిల్లా ఏటూరునాగారంలో అత్యధికంగా 12.25 సెం.మీ వర్షపా తం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఫీజురీయింబర్స్‌మెంట్ నిధులు ;విడుదల చేయాలి బీఆర్ఎస్ నేత రాకేశ్కుమా ర్
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నేత చిరుమళ్ల రాకేశ్కుమా ర్ మాట్లాడుతూ శాసనమండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి నేతృత్వంలో తమిళనాడులో బీసీలకు అందుతున్న ప్రయోజనాలపై బీఆర్ఎస్ పార్టీ అధ్యయనం చేస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయంలో అమలైన బీసీ ఓవర్సీస్ సాలర్షిప్ పథకాన్ని కొనసాగించి పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని కోరారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఉపేంద్రచారి, బీఆర్ఎస్ నేత గోసుల శ్రీనివాస్ యాదవ్ తదితరు లు పాల్గొన్నారు.