Temperature | హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తేతెలంగాణ): బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం గురువారం రాత్రి తీరం దాటే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల తకువ నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో అకడకడ ఉదయం వేళల్లో పొగమంచు కురుస్తుందని తెలిపింది. ఉత్తరతెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో చలి గాలులు వీస్తాయని వివరించింది.
రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో చలిగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆయా జిల్లాలకు మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బేలలో అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా బేలాలో అత్యల్పంగా 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమ్రంభీం జిల్లా సిర్పూర్ (యూ)లో 7.3 డిగ్రీలు నమోదైంది.