హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): దేశంలో రోగ నిర్ధారణ పద్ధతులను మరింత మెరుగుపర్చాల్సిన ఆవశ్యకతపై హైదరాబాద్లో రెండు రోజులపాటు డయాగ్నస్టిక్ స్టీవర్డ్షిప్ సింపోజియం జరిగింది. యశోద దవాఖాన సహకారంతో ఢిల్లీ సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ రేషనల్ యూజ్ ఆఫ్ డ్రగ్స్ (డీఎస్పీఆర్యూడీ), ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా (ఐఎఫ్సీఏఐ) సంయుక్తగా నిర్వహించిన ఈ సింపోజియంను యశోద దవాఖానల ఎండీ డాక్టర్ జీఎస్ రావు, గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ లింగయ్య, డీఎస్పీఆర్యూడీ హానరరీ ప్రెసిడెండెంట్ డాక్టర్ సంగీత శర్మ, ఐఎఫ్సీఏఐ ప్రెసిడెంట్ డాక్టర్ రంగారెడ్డి బుర్రి, డబ్ల్యూహెచ్వో మాజీ నిపుణుడు (ఎస్ఈఏఆర్వో) డాక్టర్ అశోక్ రతన్, క్రిటికల్ కేర్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వెంకట్ కోలా తదితరులు శుక్రవారం ప్రారంభించారు.
పరిస్థితులను బట్టి వివిధ రకాల రోగాల నిర్ధారణకు మాలిక్యులర్ టెస్టుల్లాంటి ఆధునిక పద్ధతులను అవలంబించాల్సిన అవసరం ఉన్నదని వక్తలు ఉద్ఘాటించారు. ఫైజర్ ఎడ్యుకేషనల్ గ్రాంట్తో నిర్వహించిన ఈ సింపోజియంలో వివిధ ప్రాంతాలకు చెందిన దాదాపు 200 మంది వైద్యనిపుణులు పాల్గొన్నారు.