
వీణవంక/కమలాపూర్. జూన్ 28 : టీఆర్ఎస్ సర్కారుతోనే గొల్ల, కుర్మలు ఆర్థికాభివృద్ధి చెందుతున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కిష్టంపేటలో సోమవారం గొల్ల, కుర్మల సమావేశానికి ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావుతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ.. ఈటల రాజేందర్ మధ్యలో వచ్చి.. మధ్యలోనే పోయిండన్నారు. రానున్న ఎన్నికలలో టీఆర్ఎస్కు అండగా ఉండి ఆశీర్వదించాలని కోరారు. అనంతరం మల్లన్నపల్లి గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్ఎస్లోకి రాగా, వారికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని గుండేడు గ్రామానికి చెందిన 200 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.