హైదరాబాద్, సెప్టెంబర్ 16(నమస్తే తెలంగాణ) : తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం గాంధీభవన్ ఎదుట యాదవ సంఘం నాయకులు ధర్నాకు దిగారు.
జాతీయ యాదవహక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మేకల రాములుయాదవ్ నేతృత్వంలో బైఠాయించి యాదవ నేతలకు మంత్రివర్గంలో చోటుకల్పించడంతోపాటు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు వినతిపత్రం అందించారు. గొల్లకురుమలకు మంత్రి పదవి, మూడు ఎమ్మెల్సీలు, ఆరు కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలని కోరారు.