యాదగిరిగుట్ట, ఆగస్టు 4 : యాదగిరిగుట్ట దేవస్థాన విద్యుత్తు ఈఈ ఊడెపు రామారావు సస్పెండ్ అయ్యారు. కొండపైన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో అవినీతికి పాల్పడినట్టు నిరూపణ కావడంతో సస్పెండ్ చేసినట్టు ఈవో భాస్కర్‌రావు వెల్లడించారు.
ఆలయ కార్యనిర్వహణాధికారి, అనువంశిక ధర్మకర్త అనుమతి లేకుండా, వారికి కనీస సమాచారం ఇవ్వకుండా 12 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించినట్టు తెలిపారు. విష యం తెలియడంతో విచారణ చేపట్టామ ని, నిర్ధారణ కావడంతో చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఆయన స్థానంలో సివిల్ విభాగంలోని ఈఈ దయాకర్‌రెడ్డిని ఇన్చార్జిగా నియమించినట్టు తెలిపారు.