Konidela Surekha | స్వరాష్ట్రంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా పునర్నిర్మించారు. 2016లో పునర్నిర్మాణ పనులు ప్రారంభంకాగా, 2022 మార్చి నెలలో భక్తుల దర్శనార్థం ఆలయాన్ని పునః ప్రారంభించారు. దాదాపు రూ.1800 కోట్ల వ్యయంతో ఈ ఆలయ రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. ఆగమశాస్త్రం ప్రకారం గర్భాలయం, గోపురాన్ని కాకతీయుల శిల్పకళ ఉట్టిపడేలా కృష్ణశిలలతో ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆలయ విమాన గోపురాన్ని బంగారు తాపడం చేయించారు. అభివృద్ధి పనులను పర్యవేక్షణ కోసం యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ(యాడా-వైటీడీఏ)ను ఏర్పాటుచేశారు. నేడు యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డును ఏర్పాటు చేసి నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
హైదరాబాద్, జూన్ 30(నమస్తేతెలంగాణ): తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి నూతన ట్రస్ట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది. బోర్డు తొలి చైర్మన్‌గా ఎంఎస్ఎన్ కంపెనీ చైర్మన్ మన్నె సత్యనారాయణరెడ్డిని నియమించింది. బోర్డు చైర్మన్ సహా 18 మందిని సభ్యులుగా నియమిస్తూ మంగళవారం దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ జీవో నంబర్ 392ను విడుదల చేశారు. వీరి పదవీ బాధ్యతలు, ప్రమాణస్వీకారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని యాదగిరిగుట్ట దేవస్థాన ఈవోను ఆదేశించారు. ట్రస్టులో 10 మందిని సభ్యులుగా, మరో ఏడుగురిని ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమించింది. ఎక్స్అఫీషియో, వ్యవస్థాపక ట్రస్టీ మినహా మిగతా బోర్డు సభ్యులు బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి రెండేండ్ల పాటు.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పదవుల్లో ఉంటారని పేర్కొన్నారు.
సభ్యులుగా ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, సినీనటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ, సూ కంపెనీ అధిపతి సీఎల్ రాజం సతీమణి చిల్లప్పగారి విజయారాజం తదితరులకు అవకాశం దక్కింది. ట్రస్టు బోర్డులో చైర్మన్ కాకుండా 17 మందిని సభ్యులుగా ప్రభుత్వం నియమించినప్పటికీ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ప్రాతినిధ్యం లేకపోవడం గమనార్హం. 2010లో ఏర్పాటైన యాదగిరిగుట్ట ఆలయ ధర్మకర్తల మండలిలో అత్యధికంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకే చెందిన ఆరుగురికి అవకాశం దక్కింది. కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ట్రస్టుబోర్డులో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులకు, పారిశ్రామికవేత్తలకు, ఇతర ప్రముఖులకు చోటు దక్కలేదు.
యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు సభ్యులు వీరే..
చైర్మన్:
సభ్యులు: