యాదగిరిగుట్ట, మార్చి 13: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు చిన్న పీటలు వేసి అవమానించిన ఘటనతో యాదగిరిగుట్ట దేవస్థాన అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా సమాంతరంగా ఉన్న 10 నూతన పీటలను కొనుగోలు చేశారు. ఇక నుంచి వీవీఐపీ, వీఐపీలు వచ్చే సమయంలో ప్రొటోకాల్ ప్రకారం గౌరవ మర్యాదలకు భం గం వాటిళ్లవద్దని, ప్రతి ఒక్కరికీ సమాంతరంగా ఉండే పీటలు వేసేలా చర్యలు తీసుకున్నారు.