యాదగిరిగుట్ట,యాదాద్రి భువనగిరి : యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు(Devotees) పోటెత్తుతున్నారు. వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి మొక్కులు సమర్పించుకున్నారు. గత 16 రోజులుగా భక్తులు సమర్పించిన కానుకల వివరాలను ఆలయ కార్యనిర్వహణ అధికారి వెల్లడించారు. వివిధ రూపాల్లో ఆలయానికి రూ.1.78 కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు.
86 గ్రాముల మిశ్రమ బంగారము , 3. 5 కిలోల మిశ్రమవెండిని భక్తులు స్వామివారికి సమర్పించారని తెలిపారు. 664 అమెరికా డాలర్లు, 5 యూఏఈ దిరామ్స్, 10 ఆస్ట్రేలియా డాలర్లు, 70కెనడా డాలర్లు, 600 బైసా, 25 యూరోప్ డాలర్లు, 100 సౌతాఫ్రికా డాలర్లు, బంగ్లాదేశ్ 10, వెయ్యి జపనీస్ యెన్, నేపాల్ 10, సిరియా 5000 నోట్లు హుండీలో వచ్చాయని ఆలయ అధికారులు వెల్లడించారు.