హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సమగ్రశిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా దుండిగల్ యాదగిరి ఎన్నికయ్యారు. ఆదివారం నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు.
కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అనిల్‌చారి, ప్రధాన కార్యదర్శిగా ఝాన్సీసౌజన్య, అసొసియేట్ అధ్యక్షులుగా మల్లేశ్, సురేందర్, సహదేవ్, క్రాంతికుమార్, సుమన్, ఉపాధ్యక్షులుగా ఫాతిమా, ఖాదర్, రాజేందర్, డీ దిలీప్, కనుకుల రమేశ్, జానకీరాం, సూర్యకిరణ్, సంధ్యారాణి, చందు, సమ్మయ్య, అశోక్, మహిళా అధ్యక్షురాలిగా మంజుల, ముఖ్య సలహాదారులుగా శ్రీధర్‌రెడ్డి, పాష, లీగల్ అడ్వైజర్‌గా వెంకటేశ్, క్రాంతి, అధికార ప్రతినిధిగా రవీందర్మాధవ్, ప్రచార కార్యదర్శిగా దుర్గం శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా మోహన్, కంచర్ల మహేందర్, యాదగిరి, కిరణ్‌కుమార్, చంద్రశేఖర్‌ను ఎన్నుకున్నారు.