యాదగిరిగుట్ట, అక్టోబర్ 4 : యాదగిరిగుట్ట దేవస్థానం, శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయాన్ని ప్రతిబింబించేలా వైటీడీ, యాదా ద్రి, యాదగిరిగుట్ట తదితర పేర్లతో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు అనధికారికంగా వెబ్సైట్లను నిర్వహిస్తున్నట్టు గుర్తించామని ఆలయ ఈవో భవానీశంకర్ తెలిపారు.
ఇలాంటి నకిలీ వెబ్సైట్లతో భక్తులను తప్పుదోవ పట్టించేలా సమాచారం అందించడంతోపాటు దర్శనం, సేవలు, పూజలు, వసతి, విరాళాలు, ఆన్లైన్ బుకింగ్లు తదితర సేవ ల పేరుతో మోసపూరిత లావాదేవీలకు గురిచేసే అవకాశం ఉన్నదని ఆదివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నకిలీ వెబ్సైట్లపై నిబంధనల ప్రకారం చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. యాదగిరిగుట్ట దేవస్థాన సేవలను https://yadagiriguttatemple. telangana.gov.in అధికారిక వెబ్సైట్ ద్వారానే సర్వీసులను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.