యాదాద్రి ఆలయ పునఃప్రారంభ పనులు వేగంగా పూర్తి చేయాలి : మంత్రి ఐకే రెడ్డి
మంత్రి ఐకే రెడ్డి | సీఎం కేసీఆర్ ఆదేశాలకు మేరకు యాదాద్రి ఆలయ పునః ప్రారంభ పనులన్నీ వేగంగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఆదేశాలకు మేరకు యాదాద్రి ఆలయ పునః ప్రారంభ పనులన్నీ వేగంగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మహాద్భుత ఆధ్యాత్మిక దివ్య క్షేత్రంగా రూపు దిద్దుకున్న యాదాద్రి ఆలయ పునః ప్రారంభ తేదీని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఆలయ పనుల పురోగతి, మహా సుదర్శన యాగం, మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ ఏర్పాట్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
అరణ్య భవన్ లో నిర్వహింన ఈ సమావేశానికి దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఆర్ & బీ ఈఎన్సీ గణపతి రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఈవో గీతారెడ్డి, అర్కిటెక్ట్ ఆనంద్ సాయి, తదితరులు హాజరయ్యారు.
యాదాద్రి దేవాలయ ప్రాంగణంతో పాటు టెంపుల్ టౌన్, కాటేజీల నిర్మాణాలు, లైటింగ్ ఏర్పాట్లు, కళ్యాణ కట్ట, దీక్షాపరులు మండపం, అన్న ప్రసాదం, వ్రత మండపం, గండి చెరువు సుందరీకరణ, బస్ టర్మినల్స్, తదిరతల నిర్మాణాల పురోగతిపై మంత్రి చర్చించారు. మార్చి 21న సంప్రోక్షణకు అంకురార్పణ- మహా సుదర్శన యాగం, మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాల ఏర్పాట్లు, యాగశాలల నిర్మాణం, రుత్వికులకు బస చేసేందుకు విడిది, తదితర ఏర్పాట్లపై మంత్రి ఆరా తీశారు.

గడువులోగా ఆలయ పునర్నిర్మాణ, విస్తరణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు పనుల తీరుపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించుకుంటూ.. సకాలంలో పనులన్ని పూర్తయ్యేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..భక్తజన సందోహం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాదాద్రి ఆలయ పునః ప్రారంభానికి ముహూర్తం దగ్గరపడుతుందన్నారు.
దాదాపుగా అన్ని పనులు ముగింపు దశకు చేరుకున్నాయని, ఇంకా పెండింగ్ లో ఉన్న కొన్ని పనులను ఫిబ్రవరరి లోపు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో ఈ పుణ్యక్షేత్రాన్ని సకల హంగులతో దేదీప్యమానంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు విమాన గోపుర బంగారు తాపడానికి విరాళాలు ఇచ్చేందుకు దాతలు ముందుకు వస్తున్నారన్నారు.
ఎన్ఆర్ఐల నుంచి విరాళాల సేకరణకు ప్రత్యేక యాప్ఆ విష్కరణ..
ఎన్ఆర్ఐ దాతల నుంచి సేకరించిన నిధులతో ఆలయాల్లో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ మంత్రి తెలిపారు. తెలంగాణ ఐటీ శాఖ రూపోందించిన ప్రత్యేక మొబైల్ యాప్ ను గురువారం అరణ్య భవన్ లో మంత్రి ఆవిష్కరించారు. ధైవ భక్తితో సేవ చేసేందుకు ఎంతో మంది శఎన్ఆర్ఐ భక్తులు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని, అలాంటి వారి కోసం ప్రత్యేకంగా T APP FOLIO మొబైల్ యాప్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు.
ఇందులో నాన్ రెసిడెంట్ ఇండియన్ అనే ప్రత్యే ఆప్షన్ ద్వారా యాదాద్రి ఆలయంతో పాటు హైదరాబాద్ నగరంలోని బల్కంపేట్ ఎల్లమ్మ, పెద్దమ్మ గుడి, సికింద్రాబాద్ గణేష్ టెంపుట్, కర్మాన్ ఘాట్ ఆలయాలకు ఎన్ఐఆర్ దాతలు విరాళాలను పంపవచ్చని తెలిపారు.

త్వరలోనే ఈ సేవలను మరిన్ని ఆలయాలకు విస్తరించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కే. జ్యోతి, డిఫ్యూటీ కమిషనర్ రామకృష్ణ, యాదాద్రి ఆలయ ఈవో గీతారెడ్డి, వేములవాడ ఈవో కృష్ణ ప్రసాద్, బాసర ఆలయ ఈవో వినోద్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

