యాదాద్రి: శ్రీవారి ఖజానాకు రూ. 9,77,883 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్‌తో రూ.1,47,060, రూ. 100 దర్శనంతో రూ. 75,000, నిత్య కైంకర్యాలతో రూ.1,400, సుప్రభాతం ద్వారా రూ.1,400, క్యారీ బ్యాగులతో రూ. 2,750, సత్యనారాయణ స్వామి వ్రతాల ద్వారా రూ. 84,500, కల్యాణకట్టతో రూ. 22,800, ప్రసాద విక్రయంతో రూ. 4,24,810,
శాశ్వత పూజల ద్వారా రూ. 12,000, వాహన పూజలతో రూ. 6,300, టోల్గేట్తో రూ. 630, అన్నదాన విరాళంతో రూ.11,834, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 86,080, యాదరుషి నిలయంతో రూ. 51,850, పాతగుట్టతో రూ. 25,055, ఇతర విభాగాల ద్వారా రూ. 25,016 తో కలుపుకుని స్వామి వారికి మొత్తం రూ. 9,77,883 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.
యాదాద్రీశుడి సేవలో ప్రభుత్వవిప్
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. నేరుగా స్వామివారి వద్దకు చేరుకున్న ప్రభుత్వ విప్, స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు ప్రభుత్వ విప్‌నకు స్వామి వారి వేద ఆశీర్వచనం, తీర్ధప్రసాదాలు అందజేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.