దేశంలోనే పచ్చదనం పెంచేందుకు చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుత కార్యక్రమమని ప్రముఖ సినీరచయిత విజయేంద్రప్రసాద్ పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో గురువారం ఆయన పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని శ్రీనగర్‌కాలనీలో విజయేంద్రప్రసాద్ మొక్కలు నాటారు. అనంతరం వాటికి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పచ్చదనాన్ని పెంచే ఈ కార్యక్రమంలో తాను పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కుమార్‌ను అభినందించారు.