World Telugu Literature Festival | న్యూజీలాండ్ కేంద్రంగా 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నది. ఈ నెల 17-18 తేదీలు, వచ్చే నెల రెండో తేదీన ఈ సాహితీ సదస్సు నిర్వహిస్తున్నారు. అక్లాండ్ కేంద్రంగా జరుగుతున్న ఈ సాహితీ సదస్సులో ముఖ్య అతిధులుగా ప్రముఖ గేయ రచయత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, ప్రముఖ రచయిత ఓలేటి పార్వతీశం ప్రత్యక్షంగా పాల్గొననున్నారు.
ఇంటర్నెట్ (వీడియో కాన్ఫరెన్స్) ద్వారా ప్రముఖ గేయ రచయత భువనచంద్ర, ప్రముఖ నటుడు-రచయత తనికెళ్ళ భరణి, ప్రముఖ రచయత డేనియల్ నైజర్స్ (ఫ్రాన్స్ ) పాల్గొంటారు.
ఈ సదస్సుకు హాజరయ్యే ఆహూతుల సమక్షంలో ప్రారంభ వేదిక, ఒక పురస్కార వేదిక ఉంటుంది. రెండు ప్రత్యక్ష ప్రసార వేదికలు, 14 అంతర్జాల (ఇంటర్నెట్) కేంద్ర ప్రసంగ వేదికలు, ఒక పురస్కార వేదిక ఉంటాయి.
36 గంటల పాటు తెలుగు సాహిత్యంపై ఆహుతుల ప్రసంగాలు ఉంటాయి. కెనడాకు చెందిన కొమరవోలు సరోజ, భారత్ నుంచి ఓలేటి పార్వతీశంలకు ఈ సాహితీ సదస్సు వేదికగా జీవన సాఫల్య పురస్కారాలు ప్రదానం చేస్తారు.
ఈ సదస్సుకు కార్యనిర్వాహక వర్గ నిర్వాహుకులుగా వంగూరి చిట్టెన్ రాజు (హ్యూస్టన్, టెక్సాస్), శ్రీలత మగతల (న్యూజీలాండ్), శాయి రాచకొండ (హ్యూస్టన్, టెక్సాస్), రావు కొంచాడ (ఆస్ట్రేలియా), రత్నకుమార్ కవుటూరు (సింగపూర్), డా. వెంకట ప్రతాప్ (మలేషియా), రాపోలు సీతారామరాజు (జోహానెస్ బర్గ్), రాధిక మంగిపూడి (భారత దేశం, సింగపూర్), వంశీ రామరాజు (భారత దేశం), వెంకట్ తరిగోపుల (ఆస్లో, నార్వే), లక్ష్మి రాయవరపు:(టొరంటో, కెనడా), రాధాకృష్ణ గణేశ్న (సింగపూర్) మధు చెరుకూరి (ఆర్లాండో, ఫ్లోరిడా) వ్యవహరిస్తారు.
ఈ సాహితీ సదస్సు వేడుకలను ఆసక్తి గల వారు ఈ కింది ప్రసార మాధ్యమాల్లో తిలకించి, ఆనందించవచ్చునని నిర్వాహకులు తెలిపారు.
YouTube Links (updated):
Vanguri Foundation of America https://bit.ly/3epi8Do
Vamsee Art Theaters https://youtu.be/l1mQdnZk-Eo
Sri Samskruthika Kalasaradhi https://youtu.be/jfa9D9GuSE8
Telugu Malli https://youtu.be/XGcsW-cnnkA
Veedhi Arugu https://youtu.be/T579HfPhBVI
Telugu Talli Canada https://youtu.be/6N-Q6QdvOeo
Singapore Telugu TV https://youtu.be/CkW8fnk8T6s
Malaysia Telugu Sangham