హైదరాబాద్ : ప్రభుత్వం సాంఘిక, మైనారిటీల సంక్షేమ కార్యక్రమాలకు మంజూరు చేసిన నిధులతో పనులు వెంటనే పూర్తి చేయాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని తన ఛాంబర్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. అసంపూర్తిగా ఉన్న పనుల పూర్తికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు సంబంధిత వాటికే ఖర్చు చేయాలని వెల్లడించారు.
నిర్మాణంలో ఉన్న షాదీఖానాలు, ఎస్సీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి మహామ్మద్ నాదీమ్, డైరెక్టర్ షన్వాజ్ ఖాసీం, సాంఘిక సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి ఉమాదేవి, విజయకుమార్ పాల్గొన్నారు.