అచ్చంపేట, ఫిబ్రవరి 1 : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై సామాన్య కూలీలు అభిమానాన్ని చాటుకున్నారు. పొలంలో పాటలు పాడుతూ.. ఆడుతూ హోరెత్తించారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని కొర్రతండాలో సింగిల్‌విండో డైరెక్టర్ హన్మంతునాయక్ వ్యవసాయ పొలంలో వరినాట్లు వేసేందుకు కూలీలు వచ్చారు. అయితే ‘కేసీఆర్ పిలుపున్నది రామక్క, మంచిపాలన చేసినడు రామక్క, మళ్లీ గెలిచివస్తాడు రామక్క’.. అన్న పాటకు డ్యాన్స్ చేశారు. ట్రాక్టర్‌తో చదును చేస్తూ వరినాట్లు వేస్తూ ఉల్లాసంగా.. ఉత్సాహంగా పనిలో మునిగిపోయారు. బంజారా కూలీలు ఈలలు, కేకలు వేస్తూ పొలంలోనే నృత్యం చేస్తూ కేసీఆర్‌పై మమకారాన్ని చాటుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.