ఆగస్టు 5 నుండి తిరిగి తెరుచుకోనున్న ‘వండర్ లా’ థీమ్ పార్క్

హైదరాబాద్ : నగరంలోని వండర్ లా పార్క్ ఆగస్టు 5వ తేదీ నుండి తిరిగి తెరుచుకోనుంది. అన్ని వయస్సుల వారికి రూ .799 (జీఎస్టీతో సహా) పరిమిత ఆఫర్‌తో పార్క్‌లోని అన్ని వసతులు అందుబాటులో ఉంటాయి. ఈ థీమ్ పార్క్ గురువారం నుండి ఆదివారం వరకు ఉదయం 11 నుండి తెరిచి ఉంటుంది. పర్యాటకులు, సందర్శకులు ఎంట్రీ టికెట్ల కోసం bookings.wonderla.com కు లాగినై బుక్ చేసుకోవచ్చు. కొవిడ్ నేపథ్యంలో ఈ పార్క్ 50 శాతం సామర్థ్యంతో పనిచేయనుంది.
వండర్ లా హాలిడేస్ లిమిటెడ్ ఎండీ అరుణ్ కె చిట్టిలపిల్లి మాట్లాడుతూ.. సందర్శకులను ఆహ్వానించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామన్నారు. త్వరలోనే తమ ఇతర పార్కులను కూడా తెరవాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. తమ సిబ్బందికి ఇప్పటికే కొవిడ్ టీకాలు పూర్తిచేసినట్లు వెల్లడించారు. మాస్కులు ధరించడం తప్పనిసరి అన్నారు. ఔటర్ రింగ్ రోడ్ రావిరాల గ్రామం ఎగ్జిట్ నంబర్ 13కు సమీపంలో ఈ వండర్ లా థీమ్ పార్క్ ఉంది. మరిన్ని వివరాలకు వండర్ లా వెబ్సైట్ https://www.wonderla.com/, లేదా 040 23490300, 040 23490333 నంబర్లకు ఫోన్‌కాల్ చేసి తెలుసుకోవచ్చని అరుణ్ పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

