హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని వయసుల వారికి ఉచితంగా టీకాలు వేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం అద్భుతమని మంత్రి కేటీఆర్ కొనియాడారు. ట్విట్టర్ ద్వారా మంత్రి స్పందిస్తూ.. ఈ పరీక్షా సమయంలో ప్రజలకు తమ ప్రభుత్వాల నుండి వీలైనంత మద్దతు అవసరమన్నారు. సీఎం నిర్ణయానికి చేతులెత్తి దండం పెడుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రజలు ఏ విధమైన భయభ్రాంతులకు గురికావద్దని, కరోనా సోకినవారికి పడకల విషయంలోనూ, మందుల విషయంలోనూ ప్రభుత్వం చేయాల్సినదంతా చేస్తున్నదని, ప్రజలను కోవిడ్ బారి నుండి కాపాడడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నదని, పెద్ద ఎత్తున సానిటేషన్ చేపట్టిందనీ ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.
Wonderful decision by Hon’ble CM KCR Garu to vaccinate all age groups in Telangana free of cost 🙏
— KTR (@KTRTRS) April 24, 2021
People need as much support as possible from their Governments during these testing times https://t.co/DsuAzDeNmt