హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులపై వ్యాఖ్యలు చేసిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామిని ఈ నెల 22న వ్యక్తిగతంగా హాజ రు కావాలని రాష్ట్ర మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. ఈ మేరకు కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద మంగళవారం ఉత్తర్వులు జారీ చే శారు. సినీ నటులు అకినేని నాగచైతన్య, శోభి త ధూళిపాళ్ల నిశ్చితార్థం సందర్భంగా వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అయ్యాయి. వేణుస్వామిపై చర్యలు తీసుకోవాలని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్, తె లుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్లు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యం లో సమన్లు జారీ చేసింది. గతంలో కూడా సినిమాలు, రాజకీయాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసి విమర్శలపాలైన విషయం తెలిసిందే.
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్థానికత ఉండి.. రాష్ట్ర విభజన సమయంలో కమలనాథన్ కమిటీ ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రిలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణకు రిలీవ్ అవుతున్న ఉద్యోగులు తమ కేడర్లోనే చివరి ర్యాంక్‌లో విధుల్లో చేరుతారని స్పష్టం చేసింది.
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ బస్సులో ఫిట్స్ వచ్చిన ప్రయాణికుడిని సకాలంలో దవాఖానలో చేర్పించి డ్రైవర్ ఉదారత చాటుకున్నారు. వరంగల్-2 డిపోకు చెందిన సూపర్‌లగ్జరీ బస్సు హైదరాబాద్ నుంచి హన్మకొండకు సోమవారం వెళ్తున్నది. హైదరాబాద్ శివారు ఘట్కేసర్ దాటగానే సంతోష్ అనే ప్రయాణికుడికి ఫిట్స్ వచ్చింది. తోటి ప్రయాణికులు విషయాన్ని డ్రైవర్ బీ వెంకన్న దృష్టికి తీసుకెళ్లారు. ప్రయాణికుడిని పరిశీలించిన డ్రైవర్.. వెంటనే మరో ప్రయాణికుడు శ్రీనివాస్ సహకారంతో బీబీనగర్‌లోని ఎయిమ్స్ దవాఖానకు బస్సును తీసుకెళ్లారు. సంతోష్‌ను సకాలంలో దవాఖానలో చేర్పించడంతో ప్రాణాపాయం తప్పింది. మానవత్వంతో వ్యవహరించిన డ్రైవర్ బీ వెంకన్నను హైదరాబాద్ బస్ భవన్లో మంగళవారం ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సన్మానించారు. సంతోష్‌ను దవాఖానకు తరలించడంలో డ్రైవర్‌కి సహకరించిన ప్రయాణికుడు శ్రీనివాస్‌కు, వైద్యం అందించిన ఎయిమ్స్ వైద్య బృందానికి ఎండీ సజ్జనార్ అభినందనలు తెలిపారు.