హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): మిస్ వరల్డ్-2025 పోటీలకు వ్యతిరేకంగా నిరసన తెలి పే మహిళల హకుపై తెలంగాణ ప్రభుత్వం దాడి చేస్తున్నదని అందా ల పోటీల వ్యతిరేక పోరాట వేదిక మండిపడింది. ప్రభుత్వం అప్రజాస్వామిక పద్ధతిలో అరెస్టులకు, గృ హ నిర్బంధాలకు పాల్పడుతున్నద ని వివిధ సంఘాల ప్రతినిధులు వి మర్శించారు. బుధవారం ఉదయం పోలీసులు పీవోడబ్ల్యూ నాయకురా లు సంధ్య ఇంటిని చుట్టుముట్టారని తెలిపారు.
మే 10న నిరసన తెలిపిన వారిపై పోలీసులు క్రూరంగా ప్రవర్తించారని మండిపడ్డారు. సూర్యాపేట, నల్లగొండ, మిర్యాలగూడ, హై దరాబాద్ జిల్లాల పోలీసులు పీవోడబ్ల్యూ, ఐద్వా, పీవైఎల్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. కార్పొరేట్ ప్రయోజనాల కోసమే అందాల పోటీలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. మహి ళా సంఘాల పట్ల వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్టు పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య తెలిపారు. తాము నిజమైన మహిళా సాధికారతను కోరుతున్నామని ఝాన్సీ పేర్కొన్నారు.